Gujarat: శరన్నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. అమ్మవారి ముందు దాండియా ఆడుతూ కుప్పకూలిపోయాడు…

|

Oct 03, 2022 | 10:50 AM

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన దుర్గాష్టమి రోజు అమ్మ దుర్గా మాతగా భక్తులకు దర్శనమిస్తోంది. జగన్మాతకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు...

Gujarat: శరన్నవరాత్రి ఉత్సవాల్లో విషాదం.. అమ్మవారి ముందు దాండియా ఆడుతూ కుప్పకూలిపోయాడు...
Boy Fell Down
Follow us on

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన దుర్గాష్టమి రోజు అమ్మ దుర్గా మాతగా భక్తులకు దర్శనమిస్తోంది. జగన్మాతకు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ప్రాంతాల వారీగా తమ తమ సంప్రదాయాలను అనుసరించి అమ్మను ఆరాధిస్తున్నారు. గుజరాత్‌లో నవరాత్రి వేళ అమ్మవారిని దాండియా నృత్యంతో ఆరాధించడం ఓ సంప్రదాయం. ఈ క్రమంలో గుజరాత్‌లోని ఓ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో భక్తులు దాండియా నృత్యం చేస్తున్నారు. ఎంతో సంతోషంగా సంప్రదాయ పద్ధతిలో యువతీ యువకులు నృత్యం చేస్తున్నారు. అంతలోనే అక్కడ తీరని విషాదం నెలకొంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో నృత్యం చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్ప కూలి పోయాడు. అంత వరకూ ఎంతో భక్తితో డ్యాన్స్ చేసిన ఆ యువకుడు అలా అచేతనంగా పడిపోవడంతో ఆలయ ప్రాంగణంలో విషాదం అలముకుంది.

వెంటనే అలర్ట్ అయిన తోటివారు అతనికి చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువకుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అప్పటి వరకూ అందరితో కలిసి అడుతూ పాడుతూ ఉన్న తమ కుమారుడు నిర్జీవంగా మారండంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన అక్కడ ఉన్నవారందరినీ కలచి వేసింది. పూజలు, వేడుకలతో సందడిగా మారాల్సిన ఆ పరిసరాల్లో నిశ్శబ్ధం నెలకొంది.

ఇవి కూడా చదవండి

కాగా.. ఉత్తర్ ప్రదేశ్ లో నవరాత్రి ఉత్సవాల్లో విషాదం జరిగింది. దుర్గాపూజ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. దుర్గా పూజ చేస్తున్న సమయంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. 64 మందికి గాయాలయ్యాయి. ప్రాణాలు దక్కించుకోవడం కోసం చేసిన ప్రయత్నంలో మండపంలో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడిన వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతున్నవారిలో 20మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

 మరిన్ని జాతీయ వార్తల కోసం