YCP MP: పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ.. ఐసీయూలో చికిత్స.. నిలకడగా ఉందన్న వైద్యులు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో సోమవారం ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడిపోయారు. అప్రమత్తమైన

YCP MP: పార్లమెంటులో సొమ్మసిల్లి పడిపోయిన వైసీపీ ఎంపీ.. ఐసీయూలో చికిత్స.. నిలకడగా ఉందన్న వైద్యులు..
Pilli Subhash Chandra Bose

Updated on: Feb 07, 2022 | 7:22 PM

Pilli Subhash Chandra Bose: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లో సోమవారం ఆయన ఒక్కసారిగా సొమ్మసిల్లి కిందపడిపోయారు. అప్రమత్తమైన సహచర ఎంపీలు వెంటనే స్ట్రెచర్ తెప్పించి ఆయన్ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.  బీపీ, షుగర్ ఒక్కసారిగా పడిపోవడంతో ఆయన కళ్లు తిరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యవర్గాల ద్వారా తెలిసింది. అయితే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు ఆస్పత్రికి వెళ్లి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లుగా సమాచారం.

అంతకు ముందు.. ఆరో రోజు పార్లమెంట్ సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. భారత గానకోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పార్లమెంట్ ఉభయసభలు నివాళులర్పించాయి. లతా మంగేష్కర్ గౌరవార్థం ఉభయ సభలు గంటపాట వాయిదా పడింది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య  అనంతరం సాయంత్రం 4 గంటలకు లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా సంస్మరణ సందేశం చదివి వినిపించారు.

ఇవి కూడా చదవండి: Uniform Measurements: వివాదంగా మారిన మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల వ్యవహారం.. స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ..

CM KCR Yadadri visit: శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య పరిశీలన..