Traffic Rules: వాహనదారులకు దిమ్మతిరిగే అలర్ట్.. అక్కడ రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే 10 రెట్లు ఎక్కువ ఫైన్ కట్టాల్సిందే..

|

Aug 26, 2022 | 1:41 PM

ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. వాహనదారులు తగ్గెదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకెళ్తుంటారు. ముఖ్యంగా సిగ్నల్స్ బ్రేక్ చేయడం, స్పీడుగా వెళ్లడం, రాంగ్ సైడ్లో ప్రయాణించడం, ఓవర్ టేక్ చేయడం వల్ల ఘోర ప్రమాదాలు జరుతుంటాయి.

Traffic Rules: వాహనదారులకు దిమ్మతిరిగే అలర్ట్.. అక్కడ రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేస్తే 10 రెట్లు ఎక్కువ ఫైన్ కట్టాల్సిందే..
Wrong Side Driving
Follow us on

Wrong-side driving: ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం, వాహనదారుల నిర్లక్ష్యం మూలంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. వాహనదారులు తగ్గెదేలే అంటూ రయ్యిరయ్యిన దూసుకెళ్తుంటారు. ముఖ్యంగా సిగ్నల్స్ బ్రేక్ చేయడం, స్పీడుగా వెళ్లడం, రాంగ్ సైడ్లో ప్రయాణించడం, ఓవర్ టేక్ చేయడం వల్ల ఘోర ప్రమాదాలు జరుతుంటాయి. దీంతోపాటు అటుగా వెళ్లే ప్రయాణికులకు కూడా అసౌకర్యం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో.. వారి ప్రాణాలకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. వాహనదారులు రాంగ్ రూట్లో ప్రయాణిసుండటంతో గురుగ్రామ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హర్యానాలోని వాణిజ్య నగరం గురుగ్రాంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను, ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్‌ లాంటి వాటిని అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు.ఇకనుంచి గురుగ్రామ్‌లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు సిటీ ట్రాఫిక్ పోలీసులు 10 రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. గత ఏడాది జనవరిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ.. తాజాగా నియమాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాతోపాటు, డ్రైవింగ్ లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేయడం లాంటి కఠిన నియమాలు కూడా ఉన్నాయి.

గురుగ్రామ్‌లో కొత్త ట్రాఫిక్ చలాన్ నిబంధనల ప్రకారం.. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే రూ.5,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు గతంలో రాంగ్ సైడ్‌లో డ్రైవింగ్ చేసినందుకు ఉల్లంఘించిన వ్యక్తి నుండి కేవలం రూ.500 మాత్రమే జరిమానాగా వసూలు చేసేవారు. తాజా నిబంధనల ప్రకారం.. ఈ ప్రమాదకరమైన వ్రాంగ్ డ్రైవింగ్ పై మరో రూ.5,000 రుసుంను పెచారు. ఎవరైనా ఉల్లంఘిస్తే.. రెండూ కలిపి రూ.5500 చెల్లించాల్సి ఉంటుంది.

రాంగ్ సైడ్ డ్రైవింగ్ తోపాటు.. ట్రాఫిక్ నేరాలను అరికట్టేందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.5,000 జరిమానా, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేసినా లేదా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపినా ఒక్కొక్కరికి రూ.1,000, నకిలీ నంబర్ ప్లేట్‌లకు రూ.3,000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే ప్రధాన కూడళ్ల వద్ద నిఘాను పెంచారు. నగరంలో జరిగే ప్రతి ఐదు ప్రమాదాల్లో ఒకటి రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్లే జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు తరచూ మెట్రో నగరాలైన ఢిల్లీ, ఫరీదాబాద్, నోయిడాలో కూడా జరుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..