ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతి చనిపోలేదు..! శరీరం ఇంకా వెచ్చగానే ఉందంటున్న కుటుంబ సభ్యులు

|

Jun 15, 2021 | 1:28 PM

మా కుటుంబ పెద్ద చనిపోలేదు.. అతని నాడి కొట్టుకుంటోంది.. శరీరం ఇంకా వేడిగానే ఉంది.. ఇలా చెప్పింది ఎవరో తెలుసా..  ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్‌ఘాకా కుటుంబ సభ్యులు....

ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతి చనిపోలేదు..! శరీరం ఇంకా వెచ్చగానే ఉందంటున్న కుటుంబ సభ్యులు
World's Largest Family Man
Follow us on

మా కుటుంబ పెద్ద చనిపోలేదు.. అతని నాడి కొట్టుకుంటోంది.. శరీరం ఇంకా వేడిగానే ఉంది.. ఇలా చెప్పింది ఎవరో తెలుసా..  ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి అధిపతిగా రికార్డులకెక్కిన జియాన్‌ఘాకా కుటుంబ సభ్యులు. అతను మరణించి 36 గంటలు దాటుతున్నా ఆయన కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. మా కుటుంబ పెద్ద ఇంకా జీవించేఉన్నారని వారు చెబుతున్నారు. 39 మంది భార్యలు, 90 మందికి పైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లున్న 76 ఏళ్ల జియాన్‌ స్థానిక లాల్పా కోహ్రాన్‌ ధర్‌ తెగకు అధిపతి. బీపీ, సుగర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం మరణించినట్లు స్థానిక ట్రినిటీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు.

అయితే ఆయన కుటుంబసభ్యులు మాత్రం ఆయన శరీరం ఇంకా వెచ్చగానే ఉందని.., నాడి కొట్టుకుంటూనే ఉందని  అంటున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తెచ్చాక ఆయన నాడి తిరిగి కొట్టుకోవడం ఆరంభించిందని తెగ కార్యదర్శి జతిన్‌ ఖుమా కూడా చెప్పడం విశేషం.

ఆయన కుటుంబ సభ్యులే కాకుండా స్థానికులు సైతం ఈ పరిస్థితుల్లో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధంగా లేరన్నారు. ఆయన పూర్తిగా మరణించారని తెగ పెద్దలు భావించేవరకు జియాన్‌ను పూడ్చిపెట్టేదిలేదని తేల్చి చెప్పారు. 70 ఏళ్ల క్రితం ఈ తెగను జియాన్‌ పూర్వీకులు స్థాపించారు. వీరంతా కుటుంబపోషణకు వడ్రంగి పని చేస్తుండేవారు. ప్రస్తుతం దాదాపు 433 కుటుంబాలకు చెందిన 2500 మందికి పైగా తెగలో ఉన్నారు. జియోనా చానా మరణ వార్తను మిజోరాం ముఖ్యమంత్రి జొరామ్‌తంగా కూడా ధృవీకరించారు.

ఇవి కూడా చదవండి : Gun Firing: క‌డప జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు.. తుపాకీ కాల్పులు.. ఇద్దరు మృతి..

Petrol Diesel Price Today: ఢిల్లీలో అక్కడే ఉంది..! హైదరాబాద్‌లో మాత్రం రూ.100 మార్క్ దాటిన పెట్రోల్ ధర..! మీ నగరంలో ఎలా ఉందో..!