Gun Firing: క‌డప జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు.. తుపాకీ కాల్పులు.. ఇద్దరు మృతి..

క‌డప జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. పులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాద్ రెడ్డి తన లైసెన్స్డ్ తుపాకితో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిపై కాల్పలు జరిపాడు. దీంతో..

Gun Firing: క‌డప జిల్లాలో భగ్గుమన్న పాత కక్షలు.. తుపాకీ కాల్పులు.. ఇద్దరు మృతి..
Gun Firing
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 15, 2021 | 9:13 AM

క‌డప జిల్లాలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. పులివెందుల మండ‌లం న‌ల్ల‌పురెడ్డిప‌ల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాద్ రెడ్డి తన లైసెన్స్డ్ తుపాకీతో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిపై కాల్పలు జరిపాడు. దీంతో ఘటనా స్ధలంలోనే పార్దసారధి రెడ్డి మృతి చెందాడు. అనంత‌రం ప్రసాద్‌రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇరువురూ మృతి చెందారు. వ్యక్తిగత గొడవలే ఘటనకు కారణమని స్థానికులు అనుకుంటున్నారు. గత కొంత కాలం ఈ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగదాలు నెలకొన్నాయి. ఇదే అంశంపై చాలా సార్లు గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.  ఆస్తి విష‌యంలో వివాదాలే కాల్పుల‌కు కార‌ణమ‌ని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : CJI NV Ramana Yadadri tour: యాదాద్రికి సతీసమేతంగా సీజేఏ ఎన్వీ రమణ..

వైద్య విద్య చదవాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఏపీలోని వైద్య కాలేజీల్లో 145 పీజీ సీట్ల పెంపు..

Petrol Diesel Price Today: ఢిల్లీలో అక్కడే ఉంది..! హైదరబాద్‌లో మాత్రం రూ.100 మార్క్ దాటిన పెట్రోల్ ధర..! మీ నగరంలో ఎలా ఉందో..!