Ayodhya: యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.400 కోట్లతో అయోధ్యలో బస్‌స్టేషన్‌

Ram Mandir - Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రామమందిర తీర్ధ్ ట్రస్ట్ విరాళలను సైతం

Ayodhya: యోగి ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.400 కోట్లతో అయోధ్యలో బస్‌స్టేషన్‌
Ayodhya
Follow us

|

Updated on: Jun 15, 2021 | 10:48 AM

Ram Mandir – Ayodhya: అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చకచకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రామమందిర తీర్ధ్ ట్రస్ట్ విరాళలను సైతం సేకరించి పనులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్యలో రూ. 400 కోట్లతో బస్‌ స్టేషన్‌ నిర్మించేందుకు సీఎం యోగి ఆదిత్యనాధ్‌ నేతృత్వంలోని కేబినెట్‌ సోమవారం ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బస్టాండ్ నిర్మాణం జరగుతుందని మంత్రి సిద్దార్థ నాథ్‌ సింగ్‌ తెలిపారు. దీంతోపాటు నాలుగు లైన్ల రహదారి కూడా నిర్మించనున్నట్లు తెలిపరాు. రామ మందిరానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, పర్యాటలకు వస్తారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికోసం 9 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు.

భక్తులకు అవసరమైన అన్ని అవసరాలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అయోధ్య–సుల్తాన్‌పుర్‌ రోడ్డులో నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణం కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్న దీనికి రూ. 20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీని పొడవు 1.5 కిలోమీటర్లు ఉంటుందని, విమానాశ్రయం వరకూ ఈ రోడ్డును విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. అలహాబాద్‌లో అనూప్‌షహార్‌–బులంద్‌షహర్‌ల మధ్య ఉన్న జీటీ రోడ్‌ వద్ద నాలుగు లేన్ల ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి కూడా కేబినెట్‌ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read:

డెల్టా వేరియంట్ ఎఫెక్ట్……ఆ నగరంలో మరో నెల పాటు ఆంక్షల పొడిగింపు….ప్రధాని బోరిస్ జాన్సన్

MK Stalin: సీఎం.. అయినా సాధారణ వ్యక్తిలా.. కాన్వాయ్ ఆపి వృద్ధురాలి పిటిషన్ స్వీకరించిన స్టాలిన్..

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...