
దేశంలో అక్రమంగా బంగారం రవాణా చేయడం విచ్చలవిడిగా పెరిగిపోయింది. లక్షలు, కోట్ల విలువైన బంగారంతో పట్టుబడటం అధికారులు అరెస్టు చేయడం మామూలైపోయింది. తాజాగా ఓ మహిళ రెండున్నర కేజీల బరువున్న 27 బంగారు కడ్డీలను తరలిస్తూ సరిహద్దు భద్రతా దళానికి చిక్కింది. కేవలం రెండు వేల రూపాయల కోసం దాదాపు రూ.1.29 కోట్ల మొత్తాన్ని సరిహద్దులు దాటేందుకు యత్నించింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కు చెందిన మహిళ తన దుస్తుల్లో బంగారు కడ్డీలను ఉంచి వాటిని నడుముకు చుట్టుకుని బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు వచ్చింది.
అయితే ఈ క్రమంలో బంగారంతో ఓ స్మగ్లర్ సరిహద్దులు దాటినట్లు బీఎస్‌ఎఫ్ దళానికి సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలు చేయగా ఆమె వద్ద బంగారాన్ని గుర్తించారు. అయితే బెంగాల్‌లోని బరాసత్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తికి ఈ బంగారం అందించాలని తనకు ఆదేశాలు ఆమె బీఎస్‌ఎఫ్ సిబ్బందికి వివరించింది. రూ. 2 వేల కోసం మొదటిసారిగా ఈ పని చేసినట్లు చెప్పడంతో వారు షాకయ్యారు. అయితే ఆ బంగారాన్ని వారు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..