Viral: ప్రాణాలు తీసుకోవాలని అటల్ బ్రిడ్జి పైకి ఎక్కింది.. ఆ తర్వాత ఊహించని సీన్.. రోమాలు నిక్కపొడిచే వీడియో

ఆమెకు ఏం బాధ వచ్చిందో ఏమో.. అకస్మాత్తుగా దారుణ నిర్ణయం తీసుకుంది.. ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.. దానికోసం.. ముంబైలోని అటల్ సేతు వంతెన స్పాట్ గా నిర్ణయించుకుంది.. నీళ్లలో దూకి చనిపోవాలనేది ఆమె ప్లాన్.. ఈ క్రమంలోనే.. క్యాబ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్లింది.. సరిగ్గా బ్రిడ్జి రాగానే.. క్యాబ్ ను ఆపాలని కోరింది.

Viral: ప్రాణాలు తీసుకోవాలని అటల్ బ్రిడ్జి పైకి ఎక్కింది.. ఆ తర్వాత ఊహించని సీన్.. రోమాలు నిక్కపొడిచే వీడియో
Viral Video
Follow us

|

Updated on: Aug 17, 2024 | 9:29 AM

ఆమెకు ఏం బాధ వచ్చిందో ఏమో.. అకస్మాత్తుగా దారుణ నిర్ణయం తీసుకుంది.. ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.. దానికోసం.. ముంబైలోని అటల్ సేతు వంతెన స్పాట్ గా నిర్ణయించుకుంది.. నీళ్లలో దూకి చనిపోవాలనేది ఆమె ప్లాన్.. ఈ క్రమంలోనే.. క్యాబ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్లింది.. సరిగ్గా బ్రిడ్జి రాగానే.. క్యాబ్ ను ఆపాలని కోరింది.. ఆ తర్వాత.. నేరుగా రెయిలింగ్ అవతలి వైపునకు వెళ్లింది.. వెంటనే అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ ఆమె దగ్గరకు వెళ్లాడు.. సరిగ్గా ఆమె దూకే సమయానికి ఆమె జుట్టు అందుకుని పట్టుకున్నాడు.. అయితే.. అక్కడున్న సీసీ ఫుటేజ్ లో పరిస్థితిని గమనించిన పోలీసులు .. పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. వారు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సహాయంతో ఆమెను కాపాడారు.. ఈ షాకింగ్ ఘటన శుక్రవారం ముంబైలో చోటుచేసుకుంది.. వివరాల ప్రకారం.. అటల్ సేతు వంతెనపై 56 ఏళ్ల ములుండ్ నివాసిని రీమా పటేల్ ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమెను క్యాబ్ డ్రైవర్, పోలీసులు కాపాడారు..

ములుంద్‌కు చెందిన రీమా పటేల్ ములుంద్ నుంచి క్యాబ్‌ను బుక్ చేసుకుంది.. ఈ క్రమంలో అటల్ సేతు వంతెన దగ్గర ఆపమని కోరింది.. అనంతరం రెయిలింగ్ దగ్గరకు వెళ్లగా.. అప్రమత్తమైన డ్రైవర్ ఆమె సరిగ్గా దూకే క్రమంలో జుట్టు పట్టుకుని ఆమెను ఆపాడు.. అప్పుడే సెకన్లలోనే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు ఆమెను రక్షించారు.. అటల్ సేతు బ్రిడ్జ్ CCTV ఫుటేజ్‌లో, క్యాబ్ డ్రైవర్ మహిళ జుట్టును పట్టుకుని కనిపించాడు.. దీంతో పోలీసులను అక్కడి అధికారులు అప్రమత్తం చేశారు.. సరిగ్గా ఆమె దూకే సమయంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ సిబ్బంది రైలింగ్‌పైకి ఎక్కి మహిళను రక్షించారు.. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

వీడియో చూడండి..

“మా పెట్రోలింగ్ వ్యాన్ అదే రోడ్డులో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కారు పార్క్ చేసి ఉండడం గమనించారు. అలాగే, షేలార్ టోల్ నాకాకు చెందిన టోల్ బూత్ సిబ్బంది బ్రిడ్జిపై కారు ఆగి ఉండడాన్ని.. ఒక మహిళ రైలింగ్‌పై ఉండడాన్ని గమనించి పోలీసు బృందానికి సమాచారం అందించారు.” అని.. న్హవా షెవా ట్రాఫిక్ విభాగానికి చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ గుల్ఫరోజ్ ముజావర్ తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్లు లలిత్ అమర్‌షేత్, కిరణ్ మ్హత్రే, యశ్ సోనావానేలతో కూడిన బృందం రైలింగ్‌పైకి ఎక్కి, క్యాబ్ డ్రైవర్ సంజయ్ ద్వారకా యాదవ్ తో కలిసి మహిళను కాపాడినట్లు తెలిపారు.

మరో టిస్ట్..

అయితే.. తనది ఆత్మహత్యాయత్నం కాదని.. మహిళ పేర్కొంది.. ఆచారంలో భాగంగానే దేవుళ్ల ఫొటోలను నిమజ్జనం చేస్తున్నట్టు ఆమె న్హవ శేవ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. “తాను మొదట ఐరోలి బ్రిడ్జికి వెళ్లానని, అయితే నీళ్ళు మరింత లోతుగా ఉండాలని ఆమె ఆధ్యాత్మిక గురువు చెప్పారని, అందుకే ముంబై వైపు నుండి అటల్ సేతు వంతెనపైకి వెళ్లి రైలింగ్ పైకి ఎక్కి ఫోటోలను ఒక్కొక్కటిగా విసురుతున్నానని .. ఈ సమయంలో ట్రాఫిక్ పోలీసుల జీపు శబ్దం విని, బ్యాలెన్స్ తప్పి పడిపోయాను’’.. అని వాగ్మూలంలో పేర్కొనట్లు న్హవా షెవా పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అంజుమ్ బగ్వాన్ తెలిపారు.

“క్యాబ్ డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నాడు.. ఆమె ఫోటోలను విసిరేటప్పుడు అతను ఆమె దగ్గర నిలబడి ఉన్నాడు.. ఆమె పడిపోయినప్పుడు ఆమెను జుట్టుతో పట్టుకోగలడు.. ఇదే సమయంలో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ బృందం ఆమెను రక్షించింది” అని బగ్వాన్ పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు సంతానం లేకపోవడంతో కొంతకాలంగా మానసిక క్షోభకు గురవుతున్నట్లు పటేల్ బంధువు చెప్పారు. ఘటన జరిగిన సమయంలో పుణెలో ఉన్న ఆమె భర్తకు పోలీసులు సమాచారం అందించారు. కాగా.. ఈ ఘటన సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..