అయ్యో ఏంటి తల్లి అలా చేశావ్.. బిడ్డకు జన్మనివ్వగానే ఏం చేసిందో తెలిస్తే షాక్
కొల్‌కత్తాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత కిటీకీలో నుంచి ఆ శిశువుని బయటకి పారేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని కబ్సా ప్రాంతాలో శనివారం రోజున ఓ మహిళ తన ఇంట్లోని టాయిలెట్‌కు వెళ్లింది.
కొల్‌కత్తాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత కిటీకీలో నుంచి ఆ శిశువుని బయటకి పారేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నగరంలోని కబ్సా ప్రాంతాలో శనివారం రోజున ఓ మహిళ తన ఇంట్లోని టాయిలెట్‌కు వెళ్లింది. ఇంతలోనే ఓ నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాప ఏడుపు విని అయోమయానికి గురైన ఆమె కిటికీ గ్లాస్‌కు పగలగొట్టి అందులో నుంచి ఆ శిశువును పారేసింది. ఈ శబ్దాలు విన్న అక్కడి స్థానికులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆ శిశువును గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకోని విచారించారు. తాను గర్భవతి అన్న విషయమే తెలియదని.. గత కొన్ని నెలలుగా పీరియడ్స్ వస్తున్నాయని తెలిపింది. శనివారం రోజున టాయిలెట్ కి వెళ్లినప్పుడు శిశువు పుట్టడంతో ఆ ఏడుపు విని ఒక్కసారిగా కంగారు పడ్డానని.. అందుకే ఆ పాపను కిటికీలో నుంచి పారేశానని వివరించింది. అయితే ఆ మహిళకు మానసిక సమస్య ఉందని.. గత ఏడాది జూన్ నుంచి నవంబర్ వరకు ఓ వ్యక్తితో సహ జీవనంలో ఉండి ఆ తర్వాత అతడ్నే పెళ్లి చేసుకుందని పోలీసులు తెలిపారు. ఆమె భర్త మద్యానికి బానిసయ్యాడని.. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం తమకు తెలియదని చెప్పినట్లు పేర్కొన్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోందని.. జన్మనిచ్చిన బిడ్డను చనిపోయేలా చేసినందుకు ఆ మహిళలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..