AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 7 నుంచే భారత్ జోడో యాత్ర..

2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు 'భారత్ జోడో యాత్ర' చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. ఈ యాత్ర అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. కానీ..

Congress: 2024 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 7 నుంచే భారత్ జోడో యాత్ర..
Congress
Shaik Madar Saheb
|

Updated on: Aug 09, 2022 | 1:34 PM

Share

Congress Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం సన్నాహాలు ప్రారంభించిందే. ఇప్పటికే పలు సమావేశాలు, సభలను నిర్వహించిన కాంగ్రెస్ అగ్రనేతలు.. దేశ వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి చింతన్ శిబిర్ వేదికైంది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టాలని నిర్ణయించారు. అయితే.. ఈ యాత్ర అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభించాలని పార్టీ నిర్ణయించింది. కానీ.. మళ్లీ ముందుగానే పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభం కానుందని ఆ పార్టీ ప్రకటించింది.

సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి యాత్ర ప్రారంభమై కాశ్మీర్‌లో ముగుస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. యాత్ర 12 రాష్ట్రాల మీదుగా 3,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి పూర్తి కావడానికి దాదాపు 150 రోజులు పడుతుంది. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్ర నేతలంతా పాదయాత్రలో పాల్గొంటారని ఏఐసీసీ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు. ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ చింతన్ శిబిరం “నవ్ సంకల్ప్”లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ‘భారత్ జోడో యాత్ర’ను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. భారత్ జోడో యాత్ర ఆర్గనైజింగ్ కమిటీకి దిగ్విజయ్ సింగ్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ మేరకు దిగ్విజయ సింగ్ వరుస ట్విట్లతో పలు విషయాలను ప్రస్తావించారు. “భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం.. సర్వ ధర్మ సంభవను విశ్వసించే ప్రజలందరినీ ఏకం చేయాలన్న (జోడో ఇండియా) ప్రచారాన్ని ప్రారంభించాలని స్వాతంత్ర్య సమరయోధుడు జిజి పారిఖ్ జీ పేర్కొన్నారని.. ఇది ఈ రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా.. కాంగ్రెస్ 2024 ఎన్నికల్లో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఈ యాత్రతో ముందుకు సాగే వ్యూహంగా భావిస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే భారత్ జోడో రూట్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..