AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండిగోలో కంగనా ప్రయాణం. మీడియా అత్యుత్సాహం, డీజీసీఏ ఆగ్రహం

ఇటీవల చండీ గఢ్ నుంచి ముంబైకి కంగనా రనౌత్  ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు సేఫ్టీ రూల్స్ , భౌతిక దూరం  వంటివాటిని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్...

ఇండిగోలో కంగనా ప్రయాణం. మీడియా అత్యుత్సాహం, డీజీసీఏ ఆగ్రహం
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 12, 2020 | 5:32 PM

Share

ఇటీవల చండీ గఢ్ నుంచి ముంబైకి కంగనా రనౌత్  ప్రయాణించిన ఇండిగో విమానంలో కొందరు మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు సేఫ్టీ రూల్స్ , భౌతిక దూరం  వంటివాటిని పాటించకుండా నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ) మండిపడింది. ఇండిగో ఎయిర్ లైన్స్ సీఈఓ కి తీవ్ర పదజాలంతో లేఖను రాస్తూ.. నాడు అలా రూల్స్ ని అతిక్రమించినవారిపై ఎలాంటి చర్య తీసుకున్నారో 15 రోజుల్లోగా రిపోర్టు సమర్పించాలని, లేని పక్షంలో కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించింది.  ఇకపై ఏ దేశీయ ఎయిర్ లైన్స్ లో నైనా ఇలా జరిగితే రెండు వారాలపాటు వాటి సర్వీసును నిలిపివేస్తామని కూడా పేర్కొంది. విమానాల్లో ఫోటోలు తీయడం ఎయిర్ క్రాఫ్ట్ రూల్-13 ప్రకారం నిషిధ్ధమని  అధికారులు స్పష్టం చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ పాటించకపోవడం వంటివాటిని అనుమతించే ప్రసక్తే లేదని వారు తెలిపారు. ఈ నెల 9 న కంగనా ప్రయాణించిన ఇండిగో విమానంలో ఆమె వెంట ఉన్న మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు తోసుకుంటూ ఆమె కూర్చున్న సీటు వద్దకు రావడాన్ని డీజీసీఏ తీవ్రంగా పరిగణించింది. ఈ విధమైన ఘటనలో దేశీయ విమాన సర్వీసుల్లో ఎప్పుడు జరిగినా  రెండు వారాలపాటు సంబంధిత సర్వీసును నిలిపివేయడం ఖాయమని వార్ణింగ్ ఇచ్చింది.

Follow Us
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం