AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిల్లు కాదది.. వినాశక చర్యే.. గళమెత్తిన మేధావిలోకం

పౌరసత్వ సవరణ బిల్లు-2019 పై మేధావిలోకం భగ్గుమంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుధ్ధం, వివక్షా పూరితం, విభజనకు ఆద్యం అంటూ సుమారు 600 మందికి పైగా మేధావులు గళమెత్తారు. వీరిలో ప్రముఖ రచయితలు, ఆర్టిస్టులు, మాజీ న్యాయమూర్తులు, సెలబ్రిటీలు, మాజీ అధికారులు కూడా ఉన్నారు. పొరుగునున్న మూడు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేధావి వర్గంలో నయనతార సెహగల్, అశోక్ వాజ్ పేయి, […]

బిల్లు కాదది.. వినాశక చర్యే.. గళమెత్తిన మేధావిలోకం
Pardhasaradhi Peri
|

Updated on: Dec 10, 2019 | 6:51 PM

Share

పౌరసత్వ సవరణ బిల్లు-2019 పై మేధావిలోకం భగ్గుమంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుధ్ధం, వివక్షా పూరితం, విభజనకు ఆద్యం అంటూ సుమారు 600 మందికి పైగా మేధావులు గళమెత్తారు. వీరిలో ప్రముఖ రచయితలు, ఆర్టిస్టులు, మాజీ న్యాయమూర్తులు, సెలబ్రిటీలు, మాజీ అధికారులు కూడా ఉన్నారు. పొరుగునున్న మూడు దేశాలకు చెందిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేధావి వర్గంలో నయనతార సెహగల్, అశోక్ వాజ్ పేయి, అరుంధతీ రాయ్, అమితవ్ ఘోష్ వంటి రైటర్లు, టీ.ఎం.కృష్ణ, అతుల్ దోడియా, సుధీర్ పట్వర్ధన్, నీలిమా షేక్ లాంటి ఆర్టిస్టులు, అపర్ణా సేన్, నందితా దాస్, ఆనంద్ పట్వర్ధన్ వంటి సెలబ్రిటీలు, ఇంకా రోమిలా థాపర్, రామచంద్ర గుహ, గీతా కపూర్, జోయా హసన్ లాంటి స్కాలర్లు వీరిలో ఉన్నారు. వీరితో బాటు తీస్తా సెతల్వాద్, అరుణా రాయ్, బెజ్ వాడ విల్సన్,తో బాటు మాజీ న్యాయమూర్తులైన ఏపీ షా, యోగేంద్ర యాదవ్, నందినీ సుందర్ తదితరులు సైతం ఈ బిల్లుపై గళం కలిపారు. భారత రాజ్యాంగం..కులమతాలు, భాషలతో నిమిత్తం లేకుండా అందరికీ సమానత్వం కల్పించిందని, అయితే ఎన్నార్సీ తో సహా ఈ బిల్లు దేశ ప్రజలకు ఎన్నో సమస్యలు తెఛ్చిపెడుతుందని వీరు నిరసన వ్యక్తం చేశారు. ‘ ఇట్ విల్ డ్యామేజ్ ఫండమెంటల్లీ అండ్ ఇర్రిపేరబుల్ ది నేచర్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ ‘ అని ముక్త కంఠంతో నినదించారు. హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన ఈ బిల్లును సుమారు 12 గంటల చర్చ అనంతరం సోమవారం అర్ధరాత్రి లోక్ సభ ఆమోదించింది. ప్రతిపక్షాలన్నీ దీన్ని వ్యతిరేకించాయి.

బిల్లులో మార్పులు చేస్తేనే ఆమోదం: ఉధ్ధవ్ థాక్రే

పౌరసత్వ బిల్లుకు లోక్ సభలో తమ పార్టీ మద్దతునిఛ్చినప్పటికీ రాజ్యసభలో అలా జరగకపోవచ్ఛునని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే స్పష్టం చేశారు.’ నిన్న లోక్ సభలో మా పార్టీ ఎంపీలు ఎన్నో సందేహాలు లేవనెత్తారు.. ఎన్నో ప్రశ్నలు అడిగారు.. వాటికి సమాధానాలు లభించని పక్షంలో రాజ్యసభలో దీనికి మద్దతునిచ్ఛేది లేదు ‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ బిల్లులో మార్పులు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టాలని కోరుతున్నామని అన్నారు. ఈ బిల్లుకు మద్దతునిచ్ఛేవారు దేశ భక్తులని, ఇవ్వనివారు జాతి వ్యతిరేకులనే అభిప్రాయం మారాలని ఉధ్ధవ్ వ్యాఖ్యానించారు. లోక్ సభలో మీ పార్టీ ఈ బిల్లుకు ఎందుకు సపోర్ట్ ప్రకటించిందని ప్రశ్నించగా… పొరుగునున్న దేశాల్లో అణచివేతను, వేధింపులను ఎదుర్కొంటున్న ముస్లిమేతర వర్గాలను ఇక్కడికి రప్పించవచ్ఛనే భావనతో బిల్లుకు సభలో మద్దతు తెలిపామని, కానీ రాజ్యసభలో తాము అలా వ్యవహరించే అవకాశాలు ఉండకపోవచ్ఛునని ఆయన క్లారిటీ ఇచ్చ్చారు. .