AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఇండియాలో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు బ్రేక్‌.. ప్రభుత్వం తెలిసిన 8 అభ్యంతరాలు ఇవే!

ప్రముఖ మేసేంజర్ యాప్ వాట్సాప్‌లో తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో వాట్సాప్ తీసుకురావాలనుకుంటున్న కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌కు వేంటనే నిలిపివేయాలని వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అసలు ప్రభుత్వం ఈ ఫీచర్‌ను ఎందుకు అడ్డుకుంది, మేటాకు ఇచ్చిన నోటీసుల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

WhatsApp: ఇండియాలో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు బ్రేక్‌.. ప్రభుత్వం తెలిసిన 8 అభ్యంతరాలు ఇవే!
Govt Halts Whatsapp Username
Anand T
|

Updated on: Jul 02, 2026 | 10:58 AM

Share

వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రముఖ మేసెంజర్ యాప్ వాట్పాస్ యూజర్‌నేమ్ అనే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఫీచర్ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే ముందే.. ఇది ఎంతవరకు సురక్షితం? సైబర్ నేరాలను ఎలా నివారిస్తుంది? అనే అంశాలపై క్లారిటీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాతే దీన్ని ఇండియాలో అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. దీనిపై మూడు రోజుల్లోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.

అసలు ఏమిటీ యూజర్ నేమ్ ఫీచర్?

ఇప్పుడు మనం వాట్సాప్‌లో ఒకరితో చాట్ చేయాలంటే కచ్చితంగా మొబైల్ నెంబర్ అవసరం. కానీ ఇప్పుడు వాట్సాప్ తేబోయే ఈ కొత్త ఫీచర్‌లో మొబైల్ నంబర్‌ లేకుండానే కేవలం ఒక యూజర్‌నేమ్ ద్వారా మనం వేరే వ్యక్తును కాంటాక్ట్ అవ్వవచ్చు.. వారితో చాట్ చేయవచ్చు.అయితే ఇది యూజర్స్‌కు మరింత సేఫ్టీని ఇస్తుందని మెటా చెప్తుండగా.. దీన్నిసైబర్‌నేరగాళ్లు దుర్వినియోగం చేసే ఛాన్స్ ఉందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. మొబైల్ నెంబర్ ఉంటే నేగరాళ్లను పట్టుకోవడానిక వీలవుతుందని.. కానీ యూజర్ నేమ్‌ ద్వారా ఫేక్ అకౌంట్స్ పేరిగే ఛాన్స్ ఉందని ప్రభుత్వం అంటోంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా ప్రభుత్వం తెలిసిన 8 అభ్యంతరాలు ఇవే

  • గుర్తింపు కష్టం: మొబైల్ నంబర్లు దాచిపెట్టడం వల్ల వినియోగదారుడి అసలు గుర్తింపును ధృవీకరించడం కష్టమవుతుంది.
  • డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు: నేరగాళ్లు నకిలీ యూజర్‌నేమ్‌లను వాడుకుని ‘డిజిటల్ అరెస్ట్’ వంటి సైబర్ మోసాలకు పాల్పడవచ్చు.
  • గుర్తింపు దొంగతనం: మోసగాళ్లు బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రముఖ వ్యక్తుల పేర్లతో నకిలీ యూజర్‌నేమ్‌లను క్రియేట్ చేసి ప్రజలను మోసం చేయొయ్చు.
  • ఫిషింగ్ దాడుల ముప్పు: బాధితులను సులభంగా టార్గెట్ చేసే అవకాశం లభించడంతో ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు, ఫిషింగ్ దాడులు పెరిగే ప్రమాదం ఉంది.
  • దర్యాప్తుకు ఆటంకం: నేరగాళ్లు నకిలీ యూజర్‌నేమ్‌ల వాడడం వల్ల నేరాల సమయంలో పోలీసులుకు వారిని గుర్తించడం ఇబ్బంది మారుతుంది.
  • చట్టపరమైన స్పష్టత కరవు: ఐటీ చట్టం-2000, ఐటీ నియమాలు-2021 నిబంధనలకు ఈ ఫీచర్ ఎలా అనుగుణంగా ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.
  • వృద్ధులకు, అమాయకులకు నష్టం: కొత్తగా మెసేజ్ చేసే వారు ఎవరో తెలియకపోవడం వల్ల వృద్ధులు, సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఉన్నవారు నకిలీ ఖాతాలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది.
  • సోషల్ ఇంజనీరింగ్ దాడులు: నమ్మశక్యమైన ఫేక్ గుర్తింపులతో వినియోగదారుల నుండి సున్నితమైన సమాచారాన్ని లేదా డబ్బును రాబట్టే ప్రమాదం ఉంది.

ప్రభుత్వ తదుపరి చర్యలు

నకిలీ గుర్తింపులు, ఫిషింగ్ దాడులు, గుర్తింపు దొంగతనం, యూజర్‌నేమ్ ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారో స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం మెటాను ఆదేశించింది. వారిటి పూర్తిగా సమీక్షించిన తర్వాతే, ఈ ఫీచర్‌ను భారతదేశంలో అనుమతించాలా వద్దా అనే దానిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకు ఈ ఫీచర్ లాంచ్‌కు బ్రేక్ పడినట్టే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us