Viral: #Shweta హ్యాష్‌ట్యాగ్ వెనుక అసలు కథేంటి.. ‘ఆ’ సీక్రెట్స్ అన్నీ లీక్.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న మీమ్స్.!

Shweta Hashtag: అన్ని రాజకీయ, ఎంటర్టైన్మెంట్, క్రికెట్ అంశాల మధ్య ట్విట్టర్‌లో #Shweta అనే హ్యాష్‌ట్యాగ్ గురువారం మధ్యాహ్నం నుంచి ట్రెండింగ్‌లో.. ఉంది.

Viral: #Shweta హ్యాష్‌ట్యాగ్ వెనుక అసలు కథేంటి.. 'ఆ' సీక్రెట్స్ అన్నీ లీక్.. నెట్టింట్లో నవ్వులు పూయిస్తున్న మీమ్స్.!
Follow us
Ravi Kiran

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 18, 2021 | 10:35 PM

Shweta Hashtag: ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్, క్రికెట్ తదితర అంశాల మధ్య ట్విట్టర్‌లో #Shweta అనే హ్యాష్‌ట్యాగ్ గురువారం మధ్యాహ్నం నుంచి ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఎందుకు ఆ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏమిటీ.. అసలు సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం.

ఆ హ్యాష్‌ట్యాగ్ మీద క్లిక్ చేస్తే ఓ ఆడియో క్లిప్ మైక్రోబ్లాగింగ్ సైట్లల్లో వైరల్ అయినట్లు దర్శనమిస్తుంది. నెటిజన్లు #Shweta అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో‌ #Shweta  అనే హ్యాష్‌ట్యాగ్ నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ఆన్‌లైన్ క్లాస్‌‌ జరుగుతున్నప్పుడు శ్వేతా అనే అమ్మాయి తన ఫ్రెండ్‌తో జరిగిన సంభాషణలను స్నేహితురాలికి వివరిస్తూ ఉంటుంది. శ్వేతా అనుకోకుండా తన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయడానికి బదులుగా స్పీకర్‌ను మ్యూట్ చేసినట్లు ఆ వైరల్ ఆడియో క్లిప్‌లో వినిపిస్తుంది. తద్వారా ఆమె తన ఫ్రెండ్‌‌ సీక్రెట్స్ అన్నింటినీ క్లాస్ మొత్తానికి తెలిసేలా చేస్తుంది.

ఆ వైరల్ ఆడియో క్లిప్‌లో శ్వేతా.. ”తన స్నేహితుడు తన రహస్యాలన్నింటినీ ఎలా పంచుకున్నాడో వివరంగా చెబుతుంది. లైంగిక వాంఛ కలిగిన తన గర్ల్ ఫ్రెండ్‌ను ఎన్నిసార్లు ఔటింగ్‌కు తీసుకెళ్ళానో చెప్పాడని.. అతను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని.. ఆ అమ్మాయి మాత్రం అతడిని ఉపయోగించుకుంటోందని శ్వేతా పేర్కొంటుంది. ” నాకు కూడా తెలియదు. అతను ఆమెను చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, అయితే ఆమె ఓ సెక్స్ బానిస… అతడు ఎట్రాక్షన్ వల్ల ఆమెకు ఆకర్షితుడయ్యాడు. సెక్స్ కూడా చేశాడు.” అని శ్వేతా తెలుపుతుంది.

ఆన్‌లైన్ జూమ్ క్లాసులో ఉన్న మిగతా క్లాస్‌మేట్స్ ఈ అంశంపై శ్వేతాని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెకు వినబడదు. ఎందుకంటే స్పీకర్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇక ఎప్పుడైతే ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో.. నెటిజన్లు వరుస మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. దీనితో శ్వేతా ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.

ఆ మీమ్స్‌పై మీరు కూడా చూడండి..!

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి