మళ్లీ తెరపైకి సర్జికల్ స్ట్రైక్స్‌ అంశం.. ఈ సారి కాంగ్రెస్ అడిగిన ప్రశ్నేంటంటే..?

సర్జికల్ స్ట్రైక్స్.. గతంలో భారత్ పాక్‌పై చేసినా కూడా.. మోదీ హయాంలో యూరీ అటాక్ తర్వాత.. పాక్‌పై ఇండియన్ ఆర్మీ చేసిన దాడితో.. ఈ సర్జికల్ స్ట్రైక్ అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత పుల్వామా దాడి అనంతరం..భారత ప్రభుత్వం బాలాకోట్ ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవి జరిగిన సమయంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చిన క్రమంలో అధికార.. ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అసలు ఎయిర్ స్ట్రైక్స్ చేయకున్నా.. […]

మళ్లీ తెరపైకి సర్జికల్ స్ట్రైక్స్‌ అంశం.. ఈ సారి కాంగ్రెస్ అడిగిన ప్రశ్నేంటంటే..?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 25, 2020 | 4:40 PM

సర్జికల్ స్ట్రైక్స్.. గతంలో భారత్ పాక్‌పై చేసినా కూడా.. మోదీ హయాంలో యూరీ అటాక్ తర్వాత.. పాక్‌పై ఇండియన్ ఆర్మీ చేసిన దాడితో.. ఈ సర్జికల్ స్ట్రైక్ అంశం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత పుల్వామా దాడి అనంతరం..భారత ప్రభుత్వం బాలాకోట్ ఉగ్రస్థావరాలపై ఎయిర్ స్ట్రైక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవి జరిగిన సమయంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చిన క్రమంలో అధికార.. ప్రతిపక్షాల మధ్య మాటలయుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. అసలు ఎయిర్ స్ట్రైక్స్ చేయకున్నా.. మోదీ సర్కార్.. గొప్పలు చెప్పుకుందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. అసలు ఎయిర్ స్ట్రైక్స్ చేసినట్లు ఆధారాలేవి అంటూ ప్రశ్నించాయి. అయితే ఈ సంఘటన జరిగి దాదాపు ఏడాది గడుస్తుండగా.. మళ్లీ ఇప్పుడు ఈ అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చింది.

మోదీ హయాంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌ను ప్రశ్నించడం లేదంటూనే.. వాటి గూర్చి సమగ్రంగా దేశ ప్రజలు తెలుసుకోవాలని భావిస్తున్నారంటూ మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్‌లో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని.. ఈ దాడులను తాము ఏమాత్రం ప్రశ్నించడం లేదని. కేవలం ఎలా జరిగింది, ఏం జరిగిందో మాత్రం తెలుసుకోవాలని అనుకుంటున్నామంటూ కమల్ నాథ్ ప్రశ్నించారు. బుధవారం.. ఓ మీడియా సమావేశంలో 2016 యూరీ సర్జికల్ స్ట్రైక్స్ గురించి మీడియా ప్రతినిధులు అడగ్గా.. అందుకు స్పందించిన కమల్ నాథ్.. ఏ సర్జికల్ స్ట్రైక్స్ అంటూ రివర్స్ ప్రశ్నించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ ఏం జరిగాయో ప్రజలు వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో.. 92,000 మంది పాక్ జవాన్లను అరెస్టు చేశామన్నారు.

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!