AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఎన్నో విశేషాలు..

దేశప్రజలను ఏకం చేయడమే లక్ష్యంగా తన భారత్‌ జోడో యాత్ర కొనసాగుతుందని అన్నారు రాహుల్‌గాంధీ. ఈడీ, సీబీఐ దాడులతో విపక్షాలను బెదిరిస్తే ఎవరు భయపడరని అన్నారు. కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్‌ పాదయాత్ర కశ్మీర్‌లో ముగుస్తుంది.

Bharat Jodo Yatra: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఎన్నో విశేషాలు..
Bharat Jodo Yatra
Sanjay Kasula
|

Updated on: Sep 07, 2022 | 9:07 PM

Share

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్‌గాంధీ కన్యాకుమారిలో భారత్‌ జోడో యాత్ర ప్రారంభమయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ జాతీయ జెండాను రాహుల్‌కు అందించి యాత్రను ప్రారంభించారు. రాహుల్‌ వెంట 117 మంది నేతలు పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర సందర్భంగా 150 రోజుల పాటు కంటేనర్‌లో బస చేస్తారు రాహుల్‌. కార్యకర్తల కోసం తాత్కాలిక టెంట్లు ఉంటాయి. రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు పొడవునా కొనసాగనుంది.

భారత్ జోడో యాత్రంలో రాహుల్ గాంధీ వెంట వివిధ రాష్ట్రాలకు చెందిన 117 మంది కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. ఈ 117 మందిని భారత్ యాత్రీస్ అని పిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సుంకర పద్మశ్రీ పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి కేతూరి వెంకటేశ్, సంతోష్, కె.వెంకటరెడ్డి, కత్తి కార్తీక, బెల్లయ్య నాయక్ అనులేఖ రాహుల్ తో పాటు ముందుకు సాగుతారు.

వివిధ రాష్ట్రాల నుంచి 32 మంది మహిళలకు యాత్రలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. యాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడా హోటల్‌, ఏసీ బస్సుల్లో బస చేయరు. తాత్కాలికంగా ఏర్పాటు చేసే వసతుల్లోనే ఆయన బస చేస్తారు. పాదయాత్రలో సభలు, సమావేశాలు ఉంటాయి. ఇందులో పలు చోట్ల సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొంటారు.

పాదయాత్రకు ముందు కన్యాకుమారి లోని వివేకానంద మెమోరియల్‌ను రాహుల్‌ సందర్శించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టడానికే ఈ యాత్రను చేపట్టినట్టు రాహుల్‌ ప్రకటించారు.

ఎంతదూరం ఈ ప్రయాణం..

– ట్యాగ్‌లైన్‌ – కలిసినడుద్దాం.. ఏకం చేద్దాం..

రాహుల్‌తో పాటే.. 119 మంది భారత్‌ యాత్రీస్‌ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇందులో పాల్గొంటారు. 150 రోజుల్లో 3500 కిలోమీటర్లపాటు ఈ యాత్ర చేపడతారు. అడుగు అడుగు కలిసి నడిచి- ఐకమత్యపు గొంతకను వినిపిద్దామంటూ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ప్రతిరోజు రోజూ రెండు భాగాలుగా ఈ యాత్ర కొనసాగుతుందని, ఉదయం 7 నుంచి 10.30 గంటల వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పాదయాత్ర నిర్వహిస్తారని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. రోజూ సగటున 22 నుంచి 23 కిలోమీటర్ల చొప్పున మొత్తం 3,570 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగుతుందని వివరించారు. ప్రధాన యాత్రకు అనుబంధంగా ఆయా రాష్ట్రాల్లో చిన్న జోడో యాత్రలు నిర్వహిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?