West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొని దగ్ధమైన బస్సు..!

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు.. మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైపోయింది.

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొని దగ్ధమైన బస్సు..!
Bus Accident
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 05, 2022 | 4:47 PM

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బస్సు.. మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైపోయింది. బస్సులోని ప్రయాణికులు అందరూ సేఫ్ అవడంతో పెను ప్రమాదం తప్పింది. బంకురా జిల్లా రాయ్‌పూర్ ఠానా పరిధిలోని ఫుల్కుస్కార్ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా యగాపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ సేఫ్‌ అయ్యారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు బంకురా నుంచి జార్‌గ్రామ్ వెళ్తోంది. బంకురా-జార్‌గ్రామ్ రాష్ట్ర రహదారి గుండా రాయ్‌పూర్ ఠానా ప్రాంతంలోని ఫుల్‌కుస్మార్ అడవుల్లో బస్సు అదుపు తప్పింది. ఎదురు వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఆ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ ఎగిరి దూరంగా పడ్డారు. మరోవైపు బైక్ బస్సు చక్రాల కింద ఇరుక్కోగా.. దాదాపు 100 మీటర్ల మేరు ఈడ్చుకెళ్లింది. దాంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. ఆ మంటలు బస్సుకు వ్యాపించడంతో.. బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే, బస్సుకు మంటలు అంటుకున్న వెంటనే అందులోని ప్రయాణికులు అంతా కిందకు దిగారు. దాంతో అందరూ సేఫ్ అయ్యారు. ఇక బైక్‌పై ప్రయాణిస్తున్న మహిళ, మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలవగా.. వారిని స్థానికి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..