Gangasagar Pilgrims: సంక్రాంతి రోజున పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్లి.. సముద్రంలో చిక్కుకున్న 600 మంది భక్తులు..

|

Jan 16, 2023 | 3:50 PM

గంగాసాగర్‌లో పుణ్య స్నానాలకు వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకుపోయారు. దీంతో రాత్రంతా అక్కడే గడిపారు. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా..

Gangasagar Pilgrims: సంక్రాంతి రోజున పుణ్యస్నానాలు చేసేందుకు వెళ్లి.. సముద్రంలో చిక్కుకున్న 600 మంది భక్తులు..
Gangasagar Pilgrims
Follow us on

గంగాసాగర్‌లో పుణ్య స్నానాలకు వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకుపోయారు. దీంతో రాత్రంతా అక్కడే గడిపారు. వారిని రక్షించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమబెంగాల్‌కు చెందిన సుమారు 600 భక్తులు 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్య స్నానాలకు వెళ్లారు. ఈ సమయంలో విపరీతమైన పొగమంచు, ఆటు రావడంతో రెండు పడవులు కూడా బంగాళాఖాతంలో బురదలో చిక్కుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రి మొత్తం సముద్రంలోనే గడపాల్సి వచ్చింది. ఈ ఘటన కాక్‌ద్వీప్‌ వద్ద చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. భక్తులందరినీ రక్షించేందుకు చర్యలు చేపట్టారు. రక్షించేందుకు కోస్టుగార్డ్‌ సిబ్బంది రంగంలోకి దింపామని.. సహాయ కోసం హోవర్‌ క్రాఫ్ట్‌ను కూడా పంపినట్లు వివరించారు.

హుగ్లి నది-బంగాళాఖాతంలో సంగమించే దగ్గర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు సుమారు 500 నుంచి 600 మంది భక్తులు రెండు ఫెర్రీల్లో వెళ్లారని.. పొగమంచు, సముద్రంలో ఆటు రావడంతో నీరు తగ్గి ఆ రెండు ఫెర్రీలు బురదలో చిక్కుకుపోయినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.

ఇవి కూడా చదవండి

కాగా, సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యాత్రికుల కోసం ఆహారంతోపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు అధికారులను పలు ఆదేశాలు జారి చేసింది. పొగమంచు కారణంగా గంగాసాగర్‌ నుంచి యాత్రికులను తీసుకురావడంలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు.

కాగా, మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో దాదాపు 10 లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించారు. దాదాపు 51 లక్షల మంది గంగాసాగర్‌ను సందర్శించి పూజలు చేశారు. ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తే శుభపరిణామని విశ్వసిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..