Mamata Mangoes To Modi: తనదైన మాటల దాడితో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేయడంలో ఆమెకు మరెవరు సాటిలేరు. మోదీ, అమిత్‌షా లాంటి హేమాహేమిలను సైతం ఢీకొట్టి నిలిచే ధైర్యం. ఇవన్నీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే సొంతం అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే దీదీ… ఒక్క విషయంలో మాత్రం చాలా ఔదర్యంగా వ్యవహరిస్తుంటారు. అదే ప్రతీ ఏటా ఢిల్లీలో ఉండే పెద్దలకు తమ రాష్ట్రానికి చెందిన మామిడి పండ్లను అందించడం. బెంగాల్‌కు ప్రత్యేకంగా నిలిచే హిమసాగర్, మాల్దా, లక్ష్మణ్ భోగ్ రకాల మామిడి పండ్లను ప్రతీ ఏటా ప్రధాని మోడీతో పాటు పలువురు జాతీయ నేతలకు పంపించడాన్ని మమతా ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు.
ఇక తాజాగా పశ్చిమమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీతో పాటు అమిత్‌షాను ఢీకొట్టి విజయాన్ని సాధించి సీఎం పీఠాన్ని అదిరోహించిన మమతా.. ఈసారి కూడా పాత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా మామిడి పండ్లను తెప్పించిన మమతా బెనర్జీ.. ప్రధాని మోడీతో పాటు అమిత్ షా, రాష్టపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా మామిడి పండ్లను పంపించారు. ఎన్నికల సమయంలో యుద్ధ వాతవరణాన్ని తలపించిన తర్వాత కూడా మమత తన సంప్రదాయాన్ని కొనసాగించడం పట్ల దీదీపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read: Michael Vaughan: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ వాన్ వక్రబుద్ధి; కోహ్లీపై మరోసారి..! ఫైర్ అవుతోన్న ఫ్యాన్స్
గూగుల్‌లో పురుషులు ఎక్కువగా వెతికేవి ఈ 5 విషయాలే..! ఏంటో తెలుసుకోండి..