Azadi Ka Amrit Mahotsav: దేశ వ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంబురాలు అంబరాన్ని తాకుతున్నాయి. పట్టణం, పల్లె అనే తేడాలేకుండా ఆ సేతుహిమాచలం త్రివర్ణ జెండాలు రెపరెపలాడుతూ ఎగురుతున్నాయి. ప్రజాప్రతినిధులు, సెలబ్రెటీలు, సామాన్యులు.. ఇలా ప్రతిభారతీయుడు సంతోషముగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుతూ ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలను జరుపుకుంటున్నారు. అటు పశ్చిమ బెంగాల్‌లో స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కోల్‌కతాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జానపద కళాకారులు ప్రదర్శనల సందర్భంగా సీఎం మమతా వారితో జతకలిశారు. జానపద కళాకారులతో కలిసి.. ఓ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ సందర్భంగా వేడుకలను హాజరైన అతిధుల సహా వేడుకలకు హాజరైనవారు స్టాడింగ్ ఒవేషన్ ఇచ్చారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee joins the folk artists as they perform at the #IndependenceDay celebrations in Kolkata.#IndiaAt75 pic.twitter.com/9bvyxFm4qz
— ANI (@ANI) August 15, 2022
మన దేశ స్వాతంత్యం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మన పూర్వీకులను.. అమరవీరుల అత్యున్నత త్యాగాలకు మనం ఈరోజు నివాళులర్పిస్తున్నామని బెనర్జీ ట్వీట్ చేశారు.
75 years of Independence!
Today, we pay homage to the supreme sacrifices of our forefathers that led to our country’s independence.
We, the people of India, must preserve their sacred legacy and uphold the dignity of our democratic values and people’s rights.
— Mamata Banerjee (@MamataOfficial) August 14, 2022
“మేము, భారతదేశ ప్రజలు, వారి పవిత్ర వారసత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు. మన ప్రజాస్వామ్య విలువలు, ప్రజల హక్కుల గౌరవాన్ని నిలబెట్టాలి”అని సోషల్ మీడియా వేదికగా తెలిపారు సీఎం దీదీ
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..