తీవ్ర జ్వరం, విరేచనాలతో ఒకే ఆస్పత్రిలో చేరిన 130 మంది చిన్నారులు.. పూర్తి వివరాలు

| Edited By: Anil kumar poka

Sep 14, 2021 | 3:50 PM

కరోనా థర్డ్ వేవ్ భయాలు కొనసాగుతున్న వేళ ఆ రాష్ట్రంలో విష జ్వరాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నారులు భారీ సంఖ్యలో విష జ్వరాల బారినపడుతున్నారు.

తీవ్ర జ్వరం, విరేచనాలతో ఒకే ఆస్పత్రిలో చేరిన 130 మంది చిన్నారులు.. పూర్తి వివరాలు
West Bengal Viral Fever
Follow us on

West Bengal – Viral Fever: కరోనా థర్డ్ వేవ్ భయాలు కొనసాగుతున్న వేళ పశ్చిమ బెంగాల్‌లో విష జ్వరాలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నారులే ఈ విష జ్వరాల బారినపడుతున్నారు. ఒక్క జల్పాయిగురి జిల్లాలోనే తీవ్రమైన జ్వరం, విరేచనాలతో 130 మంది చిన్నారులు జల్పాయిగిరి సదర్ హాస్పిటల్‌లో చేరారు. వీరిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఉత్తర బెంగాల్‌ మెడికల్ కాలేజ్‌కి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ చిన్నారులకు అధిక ప్రమాదం కలిగిస్తుందని నిపుణుల హెచ్చరిస్తుండటం తెలిసిందే. చిన్నారులకు ఇంకా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయకపోవడంతో వారు థర్డ్ వేవ్‌లో ఎక్కువగా బాధితులకావచ్చని విశ్లేషిస్తున్నారు. దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో థర్డ్ వేవ్ మొదలుకావచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ నేపథ్యంలో విష జ్వరాలతో చిన్నారులు భారీ సంఖ్యలో ఆస్పత్రిలో చేరడం ఆందోళనకలిగిస్తోంది.

జల్పాయిగురి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖాధికారి చెప్పారు. ఎక్కువ సంఖ్యలో పిల్లలు జ్వరం, విరేచనాల బారినపడుతున్న దృష్ట్యా వారి కోసం ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పెంచుతున్నట్లు వైద్యులు చెప్పారు. బాధిత చిన్నారుల సంఖ్య పెరిగినా.. వారిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

West Bengal Viral Fever2

అవసరమైతే జ్వరాల పాలైన పిల్లలకు కొవిడ్ పరీక్షలు చేస్తామని వైద్యులు చెప్పారు. జల్పాయిగురి జిల్లా మెజిస్ట్రేట్ మౌమిత గోదార బసు పరిస్థితులను అంచనా వేసేందుకు ఆసుపత్రికి వచ్చి వైద్యులతో సమీక్షించారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై వారితో మాట్లాడారు. విష జ్వరాల బారినపడి చిన్నారులు భారీ సంఖ్యలో ఆస్పత్రిలో చేరడం ఆ రాష్ట్ర వ్యాప్తంగానూ కలకలం సృష్టించింది.

Also Read..

అక్కడ ఎటు చూసిన పులుల ఆనవాళ్లే.. ఆనందంలో అధికారులు.. ఆందోళనలో రైతులు, పశువుల కాపరులు..

Weight Loss Tips: ఈ మూడు కీలక సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.. ఆరోగ్య నిపుణుల సూచనలు..!