PM Modi: పశ్చిమ ఆసియా ఉద్రిక్తలపై ఈ రోజు మధ్యాహ్నం లోక్‌సభలో ప్రధాని కీలక ప్రసంగం
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెస్ట్ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక ప్రసంగం చేయనున్నారు. ప్రస్తుత పరిస్థితులు, భారత దేశ దృక్పథం, అక్కడి భారతీయుల భద్రత వంటి అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు.

మార్చి 23, సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగంలో ప్రస్తుత పరిస్థితులు, భారత దేశం యొక్క దృక్పథం, అలాగే భవిష్యత్ చర్యలపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. వెస్ట్ ఆసియా ప్రాంతంలో ఇటీవల పెరిగిన ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ నివసిస్తున్న భారతీయుల భద్రత వంటి అంశాలు కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు పరిస్థితులపై అవగాహన కల్పించడం తో పాటు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ పాత్రను మరింత బలపరచే సందేశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ ప్రసంగంపై రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తి నెలకొంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. కీలకమైన సముద్ర మార్గాలలో అంతరాయాలు, ఆ ప్రాంతంలోని భారత పౌరులు, ఆస్తుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి.కాగా పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, పెట్రోలియం, ముడి చమురు, సహజ వాయువు, విద్యుత్, ఎరువులు వంటి కీలక రంగాలలో భారతదేశ సన్నద్ధతను సమీక్షించేందుకు ప్రధాని ఆదివారం ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.
At 2 PM today, Prime Minister Narendra Modi will speak in the Lok Sabha on key aspects of the ongoing West Asia conflict. pic.twitter.com/DisWargi3C
— ANI (@ANI) March 23, 2026
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మరింత విసృత స్థాయికి చేరింది. వరుసగా అగ్ర నేతలను, ఉన్నతాధికారులను కోల్పోతున్నప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. క్షిపణులు, డ్రోన్ దాడులు గల్ఫ్‌లో ఇరాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. తాజాగా హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలో ఉన్న బ్రిటిష్ ఆధీనంలోని స్థావరంవైపు ఇరాన్ రెండు మిసైల్స్‌ను సంధించింది. అయితే అవి టార్గెట్ రీచ్ అవ్వలేదు.
