Sedition law: రాజద్రోహం చట్టం నిలుపుదలపై కిరణ్ రిజిజు స్పందన.. కోర్టు తీర్పును గౌరవిస్తామని వ్యాఖ్యలు..

దేశంలో దుర్వినియోగమవుతున్న కారణంగా రాజ ద్రోహం చట్టం(Sedition Law)పై సుప్రీంకోర్టు (Supreme Court ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని నిలుపుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది...

Sedition law: రాజద్రోహం చట్టం నిలుపుదలపై కిరణ్ రిజిజు స్పందన.. కోర్టు తీర్పును గౌరవిస్తామని వ్యాఖ్యలు..
Kiran

Updated on: May 11, 2022 | 9:40 PM

దేశంలో దుర్వినియోగమవుతున్న కారణంగా రాజ ద్రోహం చట్టం(Sedition Law)పై సుప్రీంకోర్టు (Supreme Court ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయమై రాహుల్‌ గాంధీ చేసిన విమర్శలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు(Kiren Rijiju) తిప్పుకొట్టారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ, ఆ పార్టీ ప్రముఖ నాయకులు వాక్ స్వాతంత్య్రానికి కాలరాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తీసుకొచ్చిన రాజ్యాంగంలో తొలి సవరణను రిజిజు ప్రస్తావించారు. కేరళలో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని నెహ్రూ తొలగించారని కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని, రాష్ట్రాలపై కేంద్రానికి నియంత్రణ కల్పించే ఆర్టికల్ 356ని తరచుగా ఉపయోగించడాన్ని న్యాయవ్యవస్థను బలహీనపరిచేందుకు ఆమె చేసిన ప్రయత్నాలను ఆయన ప్రస్తావించారు.

“మేము ఒకరినొకరు గౌరవిస్తాము, కోర్టు ప్రభుత్వాన్ని, శాసనసభను గౌరవించాలి, కాబట్టి ప్రభుత్వం కూడా కోర్టును గౌరవించాలి. మాకు స్పష్టమైన సరిహద్దులు ఉన్నాయి. లక్ష్మణరేఖను ఎవరూ దాటకూడదు” అని రిజిజు చెప్పారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ సమాఖ్యతను, సార్వభౌమత్వాన్ని రక్షిస్తామని స్పష్టం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనానికి నాయకత్వం వహిస్తున్నారు. చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడానికి ప్రభుత్వానికి “స్వేచ్ఛ” ఉందని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. తాజా కేసులు నమోదైతే, కోర్టులు వాటిని “త్వరితగతిన పరిష్కరించాలి” అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.

ఒకప్పుడు మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా ఉపయోగించిన వలసరాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టం కింద అభియోగాలు మోపబడిన వందల మందిని నేటి చారిత్రక క్రమం ప్రభావితం చేసింది. ఇప్పటికే దేశద్రోహ నేరం కింద జైలుకెళ్లిన వారు బెయిల్ కోసం కోర్టుల చుట్టు తీరుగుతున్నారు. ఏప్రిల్ 30న హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు మరియు ముఖ్యమంత్రుల సంయుక్త సదస్సులో, ప్రధాన న్యాయమూర్తి రమణ కూడా “లక్ష్మణరేఖ” పదాలను ఉపయోగించారు.

 

Read Also.. Srilankan Crisis: వారిపై దయ చూపించొద్దు.. శ్రీలంక సంక్షోభంపై సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు