Wayanad landslides: ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పక్షులు పసిగడతాయా..! విపత్తుకు ముందు పెంపుడు చిలుక యజమానికి వింత సంకేతాలు ..

|

Aug 07, 2024 | 8:45 AM

ఈ విధ్వంసంలో వందలాది ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంచుమించు అంతే సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు సమాచారం. వీటన్నింటి మధ్య కొన్ని వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చూరల్‌మలలో ఓ చిలుక పలువురి ప్రాణాలను కాపాడింది. ఇక్కడ నివసించే కెఎమ్ వినోద్ పెంపుడు చిలుక కొండచరియలు విరిగిపడకముందే ఏదో దారుణం జరగనుంది అనే సంకేతాలను ఇచ్చింది.

Wayanad landslides: ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే పక్షులు పసిగడతాయా..! విపత్తుకు ముందు పెంపుడు చిలుక యజమానికి వింత సంకేతాలు ..
Wayanad Landslides
Follow us on

ప్రకృతి వైపరీత్యాలను జంతువులు, పక్షులు ముందే పసిగట్టగలవని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రుజువుగా భూకంపం, తుఫాన్, వర్షం వచ్చే సమయాల్లో పక్షులు, కుక్కలు వంటివి చేసే హడావిడిని గురించి చాలాసార్లు చూశాం. విన్నాం కూడా.. భూకంపం, సునామీ, తుఫాను మొదలైన విపత్తులకు ముందు జంతువులు వింతగా ప్రవర్తిస్తాయని పలు సంఘటనల ద్వారా వెల్లడైంది. కేరళలోని వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో కూడా ఇలాంటి సన్నివేశమే కనిపించింది. అక్కడ ఓ పెంపుడు చిలుక విపత్తును ముందే గ్రహించింది. అంతేకాదు తన యజమాని అప్రమత్తం చేయడానికి ఇంట్లో నానా హంగామా సృష్టించింది. రామ చిలుక చేసిన సందడిని గుర్తించిన యజమాని ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించాడు. అందరూ అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడినప్పుడు ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. అలా నిద్రపోతున్న ఎవరికీ తెలియదు.. ప్రకృతి సైలెంట్ కిల్లర్ గా రాత్రికి రాత్రే పర్వతాల నుంచి ఓ విధ్వంసం ప్రతిదీ నాశనం చేస్తుందని. ఈ విధ్వంసంలో వందలాది ఇళ్లు శిథిలాల కింద కూరుకుపోయాయి. 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంచుమించు అంతే సంఖ్యలో ప్రజలు తప్పిపోయినట్లు సమాచారం. వీటన్నింటి మధ్య కొన్ని వార్తలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చూరల్‌మలలో ఓ చిలుక పలువురి ప్రాణాలను కాపాడింది. ఇక్కడ నివసించే కెఎమ్ వినోద్ పెంపుడు చిలుక కొండచరియలు విరిగిపడకముందే ఏదో దారుణం జరగనుంది అనే సంకేతాలను ఇచ్చింది. అది అతని కుటుంబం, స్నేహితులందరి ప్రాణాలను కాపాడింది.

వింత పనులు చేసిన చిలుక

ఇవి కూడా చదవండి

విధ్వంసానికి ముందు తన రామ చిలుక పంజరంలో రణగొణ ధ్వనులు సృష్టించడం ప్రారంభించిందని వినోద్ చెప్పాడు. గట్టిగా అరవడం మొదలుపెట్టింది. రెక్కలు విప్పి బోనులోపల వింతగా ప్రవర్తిస్తూ , అక్కడే బోనులో ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టింది. చిలుక చేష్టలకు వినోద్ మనసులో కలత మొదలైంది. బయటకు వెళ్లి చూడగా అక్కడ మురికి నీరు పేరుకుపోయి కనిపించింది. వెంటనే తన కుటుంబాన్ని నిద్ర లేపాడు. వినోద్ తన ఇరుగుపొరుగు జిజిన్, ప్రశాంత్, అష్కర్‌లకు కూడా ఫోన్ చేశాడు. నిద్రపోతున్న వారంతా ఫోన్ కాల్ తో మేలుకున్నారు. తమ ఇంటి బయట దృశ్యం చూసి అందరూ భయపడ్డారు.

చాలా మంది ప్రాణాలను కాపాడారు

హడావుడిగా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వినోద్ కాలనీ రోడ్డులోని సోదరి ఇంటికి వెళ్లాడు. తనతో పాటు తన చిలుకను కూడా తీసుకెళ్లాడు. ఈ కొండచరియలు విరిగిపడటంతో వినోద్‌, జిజిల ఇళ్లు పూర్తిగా ధ్వంసమై మట్టిలో కూరుకుపోయాయి. కాగా ప్రశాంత్, అష్కర్ ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వినోద్,యు అతని కుటుంబం ప్రస్తుతం మెప్పాడి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ క్యాంపులో నివసిస్తున్నారు. ఇక్కడ, వాయనాడ్‌లో విధ్వంసం తర్వాత తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..