Heavy Rains In South India: ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మరో 48 గంటలపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Heavy Rains In South India: ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
Rains In South India

Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:52 AM

Heavy Rains In South India: తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు మెరుపులు, ఈదారుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణ సహా తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక , కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ  ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరోవైపు కర్ణాటక, కేరళ, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కర్ణాటకలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నారు. చిక్ మంగళూరు లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెంగళూరులో కురుస్తున్న భారీ వర్షంతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ జాం అవుతుండటంతో వాహనదారులు గంటల పాటు రోడ్డుమీద ఇబ్బందులు పడుతున్నారు.

కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అధికారులు మత్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లోద్దని హెచ్చరికలు జారీ చేశారు. మల్లపురం తో సహా ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.

ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా మరో 48 గంటలపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తా , తెలంగాణ లలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వాతావరణ సూచన (Weather Forecast News)  ఇక్కడ క్లిక్ చేయండి..