జపాన్‌లోని హిరోషిమాలో జరుగుతున్న గ్రూప్ ఆఫ్ సెవెన్ (జి7) సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అనంతరం పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. జపాన్ పర్యటన ముగించుకుని మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా పాపువా న్యూ గినియా చేరుకున్నారు. పోర్ట్ మోర్స్బీకి చేరుకున్న ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. పోర్ట్ మోర్స్బీకి చేరుకున్న ప్రధాని మోడీకి.. పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సమయంలో ప్రధాని మోడీ.. ఇలా చేయవద్దంటూ మరాపేను వారించారు. అనంతరం ఆయన్ను భుజం తడుతూ.. ప్రధాని మోడీ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మరాపే ఇతర ప్రజాప్రతినిధులను, అధికారులను ఈ సందర్భంగా పరిచయం చేశారు.
భారతీయ ప్రధానమంత్రి పపువా న్యూ గినియాలో పర్యటించడం ఇదే తొలిసారి. జపాన్‌లో పర్యటన విజయవంతమైన తర్వాత, పీఎం మోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా పాపువా న్యూ గినియా చేరుకున్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. పాపువా న్యూ గినియాలో ప్రవాస భారతీయులు కూడా ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. వారు ప్రధానితో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.
పాపువా న్యూ గినియాలో, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (FIPIC) మూడవ శిఖరాగ్ర సమావేశంలో సోమవారం ప్రధాని మోడీ, జేమ్స్ మరాపేతో కలిసి పాల్గొననున్నారు. “ఈ ముఖ్యమైన శిఖరాగ్ర సమావేశానికి (ఎఫ్‌ఐపిఐసి) హాజరు కావడానికి 14 పసిఫిక్ ద్వీప దేశాలు (పిఐసి) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని మోడీ ఇంతకు ముందు చెప్పారు.
#WATCH | People from the Indian diaspora welcome Prime Minister Narendra Modi as he arrives in Papua New Guinea. pic.twitter.com/O2DfVjSRyd
— ANI (@ANI) May 21, 2023
అయితే, సూర్యాస్తమయం తర్వాత వచ్చే ప్రపంచ నాయకులకు పాపువా న్యూ గినియా సాధారణంగా సాదర స్వాగతాన్ని అందించదు. అయితే, PM మోడీకి ప్రత్యేక మినహాయింపు ఇచ్చినట్లు ఆదేశం అధికారికంగా ప్రకటించింది. ప్రధానమంత్రి మోడీ పూర్తి లాంఛనప్రాయ స్వాగతం పలకనున్నట్లు పేర్కొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..