
PM Modi launch ‘PM Vishwakarma’ Scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజున వేలాది కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం 13 వేల కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ద్వారకా సెక్టార్ 21 నుంచి సెక్టార్ 25 వరకు పొడగించిన ఢిల్లో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో ఉద్యోగులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోడీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో పిల్లలు, ప్రయాణికులు సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారితో సరదాగా మాట్లాడారు.
విశ్వకర్మ జయంతి సందర్భంగా ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్‌లో ‘పిఎం విశ్వకర్మ’ అనే కొత్త స్కీమ్‌ను ప్రారంభించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేతి వృత్తి కళాకారులతో ముచ్చటించారు మోదీ. వాళ్ల బాగోగులను, ఉపాధి, పని గురించి అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న క్రమంలో ఓ యువతి ప్రధాని నరేంద్ర మోదీకి 73వ పుట్టినరోజు సందర్భంగా సంస్కృత భాషలో శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సంస్కృత భాషలో పాట పాడుతూ ఆమె మోడీకి స్పెషల్ విషెస్ తెలిపింది.
#WATCH | A traveller in Delhi Metro wishes Prime Minister Narendra Modi in the Sanskrit language on his 73rd birthday. pic.twitter.com/7inQ7Pt4Th
— ANI (@ANI) September 17, 2023
#WATCH | Delhi: Prime Minister Narendra Modi travels in Delhi Metro ahead of inaugurating the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/O3sKCNDcTK
— ANI (@ANI) September 17, 2023
అదే విధంగా ఢిల్లీలో 73 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ (ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ -IICC) యశోభూమిని ప్రధాని మోదీ ప్రారంభించి జాతీకి అంకితం చేశారు. ద్వారకాలో యశోభూమి సమావేశ మందిరాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. ప్రపంచంలో అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇదే కావడం విశేషం..
యశోభూమిలో 15 సమావేశ గదులను నిర్మించారు. వీటిలో ప్రధాన ఆడిటోరియంతో పాటు 13 ఇతర సమావేశ గదులు ఉన్నాయి. మొత్తం 11 వేల మంది ప్రతినిధులు సమావేశం అయ్యే విధంగా రూపొందించారు. ప్రధాన ఆడిటోరియంలో 6 వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా 1.07 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు.
Prime Minister Narendra Modi interacted with passengers while travelling in the metro ahead of inaugurating the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘YashoBhoomi Dwarka Sector 25’. pic.twitter.com/yR6JYZwY7X
— ANI (@ANI) September 17, 2023
పటిష్టమైన భద్రతా చర్యలతో అత్యాధునిక హంగులతో కేంద్ర ప్రభుత్వం ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ -IICC ను నిర్మించింది.
Prime Minister Narendra Modi interacted with locals while travelling in Delhi Metro, earlier today. pic.twitter.com/ipcuFclWEh
— ANI (@ANI) September 17, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..