Watch Video: నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు! వీడియో

చేపల వేటకు వెళ్లిన పడవలో శువ్రవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్లుండి పడవలో మంటలు వ్యాపించడంతో అందులో చిక్కుకున్న 18 మంది జాలరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సహాయం కోసం కోస్టల్ అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే స్పందించిన అధికారులు హుటాహుటీన సహాయక చర్యలు చేపట్టారు..

Watch Video: నడి సముద్రంలో భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో 18 మంది ప్రాణాలు! వీడియో
Fishing Boat Fire Accident

Updated on: Feb 28, 2025 | 1:55 PM

నడి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన పడవలో శుక్రవారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలీబాగ్ కోస్టల్‌ తీరానికి దాదాపు 6 నుంచి 7 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్ గన్ కు చెందిన ఒక ఫిషింగ్ బోట్ అగ్నికి ఆహుతైంది. సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్టల్‌ గార్డ్స్, నావికాదళం అప్రమత్తమయ్యారు. హుటాహుటీన ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పడవలో ఉన్న 18 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించగలిగారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మునుముందు ఇలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సముద్ర భద్రతా సంస్థలను అప్రమత్తం చేశారు.

సఖర్ అక్షి గ్రామానికి చెందిన రాకేష్ మారుతి గన్‌కు చెందిన షిప్‌ మంటల్లో చిక్కుకుంది. మంటలు వేగంగా వ్యాప్తి చెందడంతో అందులోని జాలరులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చేపల వలలతో సహా దాదాపు 80 శాతం షిప్‌ కాలిపోయింది. అదృష్టవశాత్తూ అందులో ఉన్న 18 మంది ప్రాణాలతో బయటపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. స్థానిక మత్స్యకారులు, కోస్ట్ గార్డ్, నేవీ బోట్లు సమన్వయంతో చేసిన ప్రయత్నాలు మంటల్లో చిక్కుకున్న పడవను ఒడ్డుకు తీసుకురాగలిగారు. ప్రస్తుతం ఇంకా అగ్నిమాపక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.