Sonali Phogat: న్యాయం చేయండి.. కన్నీళ్లు తెప్పిస్తున్న సోనాలి ఫోగట్ కుమార్తె హృదయ విదారక వీడియో..

ఆ చిన్నారి వయస్సు పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు.. తన తల్లి తనకు దూరమైందనే దుఖఃలో ఉంది. తన మాతృమూర్తి తనను వదిలి వెళ్లిపోయిందంటూ ఆ చిన్నారి రోధిస్తోంది. తండ్రి..

Sonali Phogat: న్యాయం చేయండి.. కన్నీళ్లు తెప్పిస్తున్న సోనాలి ఫోగట్ కుమార్తె హృదయ విదారక వీడియో..
Sonali Phogat Funeral

Updated on: Aug 26, 2022 | 5:56 PM

Sobnali Phogat: ఆ చిన్నారి వయస్సు పట్టుమని 15 ఏళ్లు కూడా లేవు.. తన తల్లి తనకు దూరమైందనే దుఖఃలో ఉంది. తన మాతృమూర్తి తనను వదిలి వెళ్లిపోయిందంటూ ఆ చిన్నారి రోధిస్తోంది. తండ్రి ఎలాగూ లేరు.. కనీసం తన తల్లితోనైనా సంతోషంగా జీవించాలనుకునే ఆపాప ఆశ నెరవేరకుండానే.. అనాధి అయిపోయానన బాధతో తల్లడిల్లిపోతుంది. తల్లి, తండ్రి లేరనే బాధ ఎలాగుంటుందో చాలామందికి తెలుసు.. ఆ దుఖాఃన్ని తీర్చడం ఎవరి తరం కాదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత ఓదార్చినా.. ఆచిన్నారికి తన తల్లిదండ్రులను మాత్రం తీసుకురాలేరు. అందుకే తన తల్లి చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ రోధిస్తోంది సోనాలి ఫోగట్ కుమార్తె. ఈవీడియో చూస్తున్న వారందరికి కంటతడి పెట్టిస్తోంది.

బీజేపీ నాయకురాలు, టిక్ టాక్ స్టార్ సోనాలి ఫోగట్ ఈనెల 22వ తేదీన తుదిశ్వాస విడిచింది. తొలుత గుండె పోటుగా భావించినా.. చివరికి విచారణలో ఆమె సన్నిహితులూ ఆమెను హత్య చేసినట్లు నిర్థారణ అయింది. పోలీసులు తొలుత గుండె పోటు వచ్చి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారించడంతో సోనాలి ఫోగట్ కుటుంబసభ్యులకు ఎక్కడో అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులతో పాటు తన తల్లిని కడసారి చూసేందుకు కుమార్తె కూడా వచ్చింది. తన తల్లిని చూసి తల్లడిల్లిపోయింది. తన తల్లిది గుండెపోటు కాదని.. తన శరీరంపై గాయాలున్నాయి. ఈకేసులో తగిన విచారణ జరిపి.. తన తల్లి చావుకు కారణమైన దోషులను శిక్షించాలంటూ ఆమె వేడుకున్న తీరు అందరినీ కటంతడి పెట్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

తన తండ్రి సైతం లేరనే బాధ ఓవైపు, తన తల్లి తనను వదిలి ఈలోకం విడిచి వెళ్లిపోయిందనే బాధ మరోవైపు ఆచిన్నారిని కలిచివేస్తోంది. తన తల్లికి తానే తలకొరివి పెట్టాల్సి వస్తోందని కలలోనూ ఆచిన్నారి ఊహించి ఉండదు. కాని .. చిన్న వయస్సులోనే తన తల్లి చితికి నిప్పంటించాల్సిన పరిస్థితి దాపురించినందుకు అంత్యక్రియల సమయంలోనూ సోనాలి ఫోగట్ కుమార్తె పడిన బాధ అంతా ఇంతా కాదు. తన తల్లి చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ కుమార్తె అభ్యర్థించిన తీరుకు సంబంధించిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం మీద కుటుంబ సభ్యుల ఒత్తిడితో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన పోలీసులు సోనాలి ఫోగట్ ది హత్యేనని నిర్ధారించిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..