దేశ రాజధాని ఢిల్లీలో హృదయాన్ని కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి చెందిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రోడ్డు మధ్యలో బారికేడ్స్ ను ఏర్పాటు చేసి అక్కడ నిల్చుకుని విధులను నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ను కారుతో బలంగా ఢీకొట్టాడు. నిందితుడు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ దారుణ ఘటన ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో చోటుచేసుకుంది. అక్టోబర్ 24, 25వ తేదీ మధ్య రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న వీడియోలో రోడ్డులో సగ భాగం బారికేడ్ తో కవర్ చేయబడింది. బారికేడ్ల పక్క నుంచి వాహనాలు వెళ్తున్నాయి. అదే సమయంలో బారికేడ్ సమీపంలో డ్యూటీ చేస్తూ నిలిబడి ఉన్న ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపిస్తున్నాడు. కానిస్టేబుల్ ఓ కారును ఆపి దాని డ్రైవర్‌ను విచారిస్తున్నాడు. అదే సమయంలో ఒక కారు అతి వేగంగా ముందు నుంచి వచ్చి.. నిల్చుని ఉన్న కానిస్టేబుల్ ని ఢీకొట్టింది.
#WATCH | CCTV footage shows a Delhi Police personnel hit by an SUV and thrown into the air in the Connaught Place area
The incident happened on the intervening night of 24th-25th October. Police detained the car driver and action was taken against him.
(Video source: Delhi… pic.twitter.com/5lMAD0It7g
— ANI (@ANI) October 27, 2023
కారు ఢీకొనడంతో ఆ పోలీసు గాలిలోకి ఎగిరి కింద పడ్డాడు. అదే సమయంలో బారికేడ్లను ఢీ కొన్న కారు ముందుకు వెళ్ళింది. అదే సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న మరో కారును కారు ఢీ కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ గాయపడినట్లు సమాచారం.
ఘటనకు కారణమైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అతను మద్యం తాగి కారు నడుపుతున్నాడా.. లేక కొన్ని సాంకేతిక సమస్యలతో కారు అదుపు తప్పిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
ఫుటేజీలో కానిస్టేబుల్ని ని కారు ఢీకొట్టడం కనిపిస్తుంది. నిందితుడు ఉద్దేశ్యపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడితే.. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. అదే సమయంలో, ఈ సంఘటనకు సంబంధించి గాయపడిన కానిస్టేబుల్ వాగ్మూలం నమోదు చేసుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..