పేకమేడలా కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం.. దేశ రాజధాని ఢిల్లీలో ఘటన.. పరుగులు తీసిన ప్రజలు..

|

Mar 08, 2023 | 8:58 PM

ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక దుకాణం ఉంది. కానీ, కొన్ని  కుటుంబాలు మూడు అంతస్తులలో నివసిస్తున్నాయి. భవనం కూలిపోవడంతో సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి..

పేకమేడలా కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం.. దేశ రాజధాని ఢిల్లీలో ఘటన.. పరుగులు తీసిన ప్రజలు..
Building Collapses On Road
Follow us on

దేశ రాజధాని ఢిల్లీలోని భజన్‌పూర్ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్‌ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ బహుళ అంతస్తుల భవనం కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఈ మధ్యాహ్నం భవనం కూలిపోవడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.. కూలిపోయిన భవనం వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది.

అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భవనం కూలిన సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. భవనం కుప్పకూలడాన్ని గమనించిన ప్రజలు చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించారు. ఈ వీడియో చూస్తే ఇది పాత బిల్డింగ్ అని అనిపిస్తోంది. సమాచారం ప్రకారం, ఈ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక దుకాణం ఉంది. కానీ, కొన్ని  కుటుంబాలు మూడు అంతస్తులలో నివసిస్తున్నాయి. భవనం కూలిపోవడంతో సమీపంలోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇందులో కొంత మంది చిక్కుకుంటారేమోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

భవనం శిథిలావస్థకు చేరుకుందని, అందులో నివసించే వారు కొద్ది రోజుల క్రితమే భవనాన్ని ఖాళీ చేశారని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని షహందర్ నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ సంజీవ్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. శిథిలాల తొలగింపు జరుగుతోంది. మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీకి చెందిన బృందం భవనం నుండి శిధిలాలను తొలగించడంలో సహాయం చేస్తోంది. స్థానికులు కూడా పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం.

గత మార్చి 1న ఉత్తర ఢిల్లీలోని రోషనారా రోడ్డులో నాలుగు అంతస్తుల భవనం అగ్ని ప్రమాదం కారణంగా కూలిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డిసెంబర్‌లో శాశ్రీనగర్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం ఖాళీగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..