ఆ రోజు ఎస్పీబీ సాయం చేయకపోయి ఉంటే..: ప్రపంచ మాజీ ఛాంపియన్‌

ఎంతోమంది గాయకులను తీర్చిదిద్దడంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్ర వెలకట్టలేనిది, మరువలేనిది

ఆ రోజు ఎస్పీబీ సాయం చేయకపోయి ఉంటే..: ప్రపంచ మాజీ ఛాంపియన్‌

Edited By:

Updated on: Sep 26, 2020 | 5:01 PM

Viswanathan Anand on SPB: ఎంతోమంది గాయకులను తీర్చిదిద్దడంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్ర వెలకట్టలేనిది, మరువలేనిది. అయితే అలాంటి ఎస్పీబీ ప్రపంచ మాజీ ఛాంపియన్‌ విశ్వనాథన్ ఆనంద్‌కి సాయం చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తన 13ఏళ్ల వయసులో ఎస్పీబీ సాయం చేయకపోయి ఉంటే తన కెరీర్ ఎలా ఉండేదో అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

”1983లో మద్రాసు జిల్లా చెస్‌ అసోషియేషన్ ఇబ్బందులో ఉంది. మద్రాసు కోల్ట్స్ టీమ్‌కి స్పాన్సర్‌ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో నేషనల్‌ టీమ్ ఛాంపియన్‌షిప్‌ కోసం మద్రాసు కోల్ట్స్ టీమ్ నుంచి నేను పోటీలో ఉన్నా. ఈ విషయాన్ని అప్పటి ప్రముఖ గేయ రచయిత ఆరుద్ర తెలుసుకున్నారు. దీంతో బ్లాంక్ చెక్‌ మీద సంతకం చేయాలంటూ ఆరుద్ర, ఎస్పీబీని కోరారు. వెంటనే ఎందుకు అని కూడా అడగకుండా బాలు చెక్ ఇచ్చారు. ఆ డబ్బు నాకు సాయం చేస్తుందన్న విషయం కూడా ఆయనకు తెలీదు. ఇలా తెలీకుండానే నాకు సాయం చేశారు” అంటూ విశ్వనాథన్ గుర్తు చేసుకున్నారు.

ఇక ఎస్పీబీ మరణం తరువాత ట్వీట్ చేసిన ఆనంద్‌.. గొప్ప వ్యక్తి మరణ వార్త చాలా బాధిస్తోంది. ఆయన చాలా సామాన్యంగా ఉండేవారు. నా మొదటి స్పాన్సర్ ఆయనే. 1983లో నేషనల్ ఛాంపియన్‌షిప్ కోసం చెన్నై కోల్ట్స్‌ టీమ్‌కి ఆయన సాయం చేశారు. నేను కలిసిన వారిలో చాలా మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన సంగీతం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది అంటూ ట్వీట్ చేశారు.

Read More:

తన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చిన బాలు..!

డ్రగ్స్ కేసు: కరణ్ జోహార్ ప్రధాన అనుచరుడు అరెస్ట్‌