తన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చిన బాలు..!

సంగీత కళామతల్లి మరో ముద్దు బిడ్డను కోల్పోయింది. తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు

తన ఇంటిని కంచి పీఠానికి విరాళంగా ఇచ్చిన బాలు..!
Follow us

| Edited By:

Updated on: Sep 26, 2020 | 4:07 PM

SP Balasubrahmanyam house: సంగీత కళామతల్లి మరో ముద్దు బిడ్డను కోల్పోయింది. తన గాత్రంతో ఎన్నో పాటలకు ప్రాణం పోసిన గాన గంధర్వుడు ఇప్పుడు గంధర్వ లోకానికి వెళ్లారు. కరోనాను జయించి మీముందుకు వస్తానంటూ చెప్పి అందరిలో భరోసాను నింపిన ఎస్పీబీ.. ఎవరికీ చెప్పకుండానే దివికేగారు. అయితే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రఙ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న ఎస్పీబీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదిలా ఉంటే నిజ జీవితంలో బాలుకు సేవాగుణం కూడా చాలా ఎక్కువ. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మ పేటలో తన తండ్రి నిర్మించిన నివాసాన్ని కంచి పీఠాధిపతికి విరాళంగా ఇచ్చారు బాలు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిని తన నివాసానికి ఆహ్వానించిన బాలు.. తన ఇంటికి విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. బాలులోని సేవాగుణాన్ని మెచ్చుకున్న విజయేంద్ర సరస్వతి ఆ ఇంటిలో వేద పాఠశాల నిర్వహిస్తామని చెప్పారు. ఈ నివాసం ఓ గొప్ప కార్యక్రమానికి వేదికవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆ సందర్భంగా బాలు వెల్లడించారు. కాగా ఎస్పీబీ మృతితో కోనేటమ్మ పేటలో విషాదం నెలకొంది.

Read More:

Covid 19 vaccine: జాన్సన్ అండ్ జాన్సన్ టీకా.. ఆశాజనకంగా ఫలితాలు

శ్రావణి కేసు: పోలీసుల కస్టడీకి సాయి కృష్ణ, దేవరాజ్