Viral Video: ట్రైన్‌లో ప్రయాణికుడి ఫోన్ కొట్టేసి దొరికిన దొంగ.. తప్పించుకునేందుకు ఏం చేశాడో చూడండి!
ట్రైన్‌లో ఒక ప్రయాణికుడి నుంచి మొబైల్‌ను దొంగలించిన యువకుడు.. ప్రయాణికుల నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడానికి నడుస్తున్న ట్రైన్ తలుపునకు వేలాడుతూ కనిపించాడు. చివరకు ట్రైన్ స్పీడ్ కాస్తా తగ్గడంతో అతను ట్రైన్‌లోంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్రైన్‌లో ఒక ప్రయాణికుడి నుంచి మొబైల్‌ను దొంగలించిన యువకుడు.. ప్రయాణికుల నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడానికి నడుస్తున్న ట్రైన్ తలుపునకు వేలాడుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. దొంగ కొన్ని నిమిషాలు పాటు తలుపుకు వేలాడుతూ కనిపించాడు. చివరికి రైలు వేగం తగ్గినప్పుడు పొదల్లోకి దూకి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లాడు.
వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ట్రైన్ తలుపును పట్టుకొని వేడాడుతూ చిరిగిన చొక్కాలో కనిపించిన వ్యక్తి.. ట్రైన్‌లో ఒక ప్రయాణీకుడి నుంచి ఫోన్ దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. దీంతో పట్టుకున్న ప్రయాణికులు దొంగతనం చేసినందుకు అతన్ని చితకబాదారు. ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకున్న వ్యక్తి తన ప్రాణాలను కాపాడుకోవడానికి రైలు తలుపునకు వేలాడుతూ, తనను ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ల కాళ్ళు లాగేస్తానని బెదిరించాడు. అప్పుడు కొంతమంది రైలు ఆపడానికి గొలుసు లాగమని పిలుపునిస్తున్నారు. కానీ ఇంతలోనే ట్రైన్ స్పీడ్ కాస్త తగ్గడంతో ఆ వ్యక్తి ట్రైన్ నుంచి పొదల్లోకి దూకేశాడు. అయితే కిందపడిపోయిన సదురు దొంగపై ప్రయాణికులు జాలి చూపించారు. ట్రైన్ నుంచి దూకేసిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడా లేదా గాయాలతో తప్పించుకున్నాడా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
వీడియో చూడండి..
चोरी करना ग़लत है…और उसकी सज़ा भी तय है। लेकिन ट्रेन में पकड़े गए एक चोर को, जब वो डरकर भागा और दरवाज़े के बाहर लटक गया, तब उसे बचाने की जगह लोग अंदर से पीटते रहे… जैसे उसकी मौत का इंतज़ार कर रहे हों।😡 pic.twitter.com/xvUymFCnoT
— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) July 25, 2025
ఇదికూడా చదవండి.. అక్కడెలా పెట్టావు బ్రో.. ఇంటి కాంపౌండ్ గోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి..
ప్రయాణికులు, దొంగల మధ్య తీవ్ర ఘర్షణ
ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలను బట్టి చూస్తే.. కొందరు ప్రయాణికుల అతన్ను తప్పించుకునేలోపు పట్టుకోవడం చూడవచ్చు. కానీ ఎలాగోలా వారి నుంచి తప్పించుకున్న దొంగ ప్రమాదకరంగా రైలు తలుపుకు వేలాడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు అతనిపై వస్తువులు విసరడంతో పాటు ఒక ప్రయాణికులు ఏకంగా తన బెల్టుతో అతన్ని కొట్టడం కూడా చూడవచ్చు. మరోవైపు, తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వారి కాళ్ళు లాగుతానని బెదిరించినట్టు తెలుస్తోంది. దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో ప్రమాదకరమైన రైలు ప్రయాణం, వారి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
