Street Dogs: ఆ గ్రామంలో వీధి కుక్కలు కోటీశ్వరులు.. రూ. 90 కోట్ల మేర ఆస్తులు..

|

Jul 02, 2023 | 10:45 AM

ఈ స్ట్రీట్ డాగ్స్ అనుభవిస్తున్న రాజభోగాలు చూస్తే ఇంట్లో పిల్లలా పెరిగే పెంపుడు కుక్కలు మాత్రమే కాదు.. సామాన్య మానవులు సైతం అసూయా పడాల్సిందే.  వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇంతకీ ఆ కుక్కలకి అంత ఆస్తి ఎలా వచ్చిందనేగా మీ అనుమానం..

Street Dogs: ఆ గ్రామంలో వీధి కుక్కలు కోటీశ్వరులు.. రూ. 90 కోట్ల మేర ఆస్తులు..
Rich Street Dogs
Follow us on

సాధారణంగా బ్రతుకు దుర్భరంగా అనిపించినప్పుడు.. నేను బతుకుతున్నది వీధి కుక్క బతుకుతుంది అంటూ తమని తామే పోల్చుకుంటూ ఉత్నరు. అయితే ఇప్పడు అవి కూడా మహారాజులా దర్జాగా రాజభోగాలు అనుభవిస్తూ బ్రతుకుతున్నాయి. అలాగని అవి ఏ పెంపుడు కుక్కలో అనుకునేరు. కానే కాదు. అక్షరాలా వీధి కుక్కలే. అవును వీధి కుక్కలు ఇప్పడు కోట్లకు పడగలెత్తాయి. ఏకంగా కోట్ల ఆస్తికి హక్కుదారులై ఉన్నాయి. అవును గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో వీధి కుక్కలు కోట్లకు అధిపతులు తెలుసా..

గుజరాత్‌లోని పంచోత్‌ గ్రామానికి చెందిన కుక్కలు కోట్లకు అధిపతులు. వాటి పేర ఏకంగా 90 కోట్ల ఆస్తులున్నాయి. వాటి నిర్వహణకు ఓ ట్రస్ట్‌ కూడా ఉంది . ఈ ట్రస్ట్ వీధి కుక్కల పట్ల తీసుకునే కేరింగ్ తో ఈ వీధి శునకాల జీవితమే మారిపోయింది. అంతేకాదు ఈ స్ట్రీట్ డాగ్స్ అనుభవిస్తున్న రాజభోగాలు చూస్తే ఇంట్లో పిల్లలా పెరిగే పెంపుడు కుక్కలు మాత్రమే కాదు.. సామాన్య మానవులు సైతం అసూయా పడాల్సిందే.  వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ఇంతకీ ఆ కుక్కలకి అంత ఆస్తి ఎలా వచ్చిందనేగా మీ అనుమానం.. జంతువులకు సేవ చేస్తే తమకు మంచి జరుగుతుందని మెహసానా జిల్లాలోని పంచోత్ గ్రామ ప్రజలు బలంగా నమ్ముతారు. దీంతో, నిత్యం కళ్లెదురుగా తిరిగే వీధి కుక్కలను బాగా చూసుకోవాలని సేవచేయాలని వారు నిర్ణయించుకున్నారు.

వెంటనే స్థానికులు అందరూ కలిసి వీధి కుక్కల కేరింగ్ కోసం ఓ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. తమ స్థాయికి తగినట్లుగా విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారు. అయితే కొంతమంది వ్యక్తులు కుక్కల కోసం తమ కోట్ల విలువైన ఆస్తిని కూడా ట్రస్ట్ కు ఇచ్చేశారు. శునకాలకు ఫుడ్ ని అందించేందుకు.. ఆహారాన్ని తయారు చేసేందుకు కొందరు మహిళలను నియమించుకున్నారు. కుక్కలకు ఆహారాన్ని అందించేందుకు రోజుకు వెయ్యి రొట్టెలు చేస్తారు. వీటిని వాలంటీర్లు శునకాలకు ఇస్తుంటారు. వీధి కుక్కలకు ఆహారాన్ని అందించి తమ బాధ్యత తీరింది అనుకోలేదు ఆ ట్రస్ట్.. అనారోగ్యం బారిన పడితే వాటికీ వైద్యాన్ని అందించాలని భావించింది.. ఒక వెటర్నరీ డాక్టర్ ను ఏర్పాటు చేసింది. వీధి కుక్క అనారోగ్యం బారిన పడితే వెంటనే వాటికీ ఈ పశు వైద్యుడు చికిత్సను అందిస్తాడు. ఈట్రస్ట్ ద్వారా వీధి కుక్కలు అనుభవిస్తున్న రాజభోగాల గురించి తరచుగా నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..