Devendra Fadnavis: డిప్యూటీ సీఎంకి కాలివేలితో బొట్టు… ఆయన రియాక్షనేంటి..? వీడియో..
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ సోదరి కనబరిచిన ఆత్మీయతతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ సోదరి కనబరిచిన ఆత్మీయతతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలోని జలగావ్ ప్రాంతంలో ప్రత్యేక అవసరాలున్న వ్యక్తుల కోసం దీపస్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు ఓ యువతి తిలకం దిద్దారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న సన్నివేశంతో ఆయన కళ్లు చెమర్చాయి.
‘‘ఇప్పటి వరకు ఎందరో తల్లులు, సోదరీమణుల నుంచి ఆశీర్వాదం తీసుకుని తిలకం స్వీకరించాను. ఇప్పుడు కూడా నాకు తిలకం దిద్దేందుకు ఓ సోదరి బొటనవేలు నా నుదిటి మీదకు చేరింది. అయితే, అది చేతి వేలు కాదు.. కాలి బొటనవేలు. జీవితంలో ఎదురయ్యే ఇలాంటి క్షణాలు ఒక్కసారిగా ఉద్వేగానికి గురిచేస్తాయి. కళ్లు చెమర్చేలా చేస్తాయి. ఈ సోదరి నాకు తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది. ‘నాకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే.. నాకు ఎవరి జాలి, దయ అవసరం లేదు. ఆ పరిస్థితులను దాటుకొని వెళ్తాను’ అని ఆ మెరుపును చూస్తే నాకనిపించింది’’ అని ఫడణవీస్ ట్వీట్ చేశారు. అలాగే ప్రతిపోరాటంలో ఆమెకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి.. కుట్లేసిన మున్నాభాయ్
నా చీర లాగాడు !! నాసిక్ టీసీఎస్ ఉద్యోగిని ఆవేదన
లంచం తీసుకుంటూ పట్టుబడిన స్టేట్ టాపర్
సర్ప్రైజ్ గిఫ్ట్ అని పిలిచింది.. కుర్చీకి కట్టేసి మరీ.. అలా ఎలా ?
విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు
పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్
గుంతల రోడ్లతో చికాకు.. పోర్షే కారుపైనే సిమెంట్ కలిపిన యువకుడు..

