Khammam: అయ్యో.. నాకు దిక్కెవరు..? కన్నబిడ్డల వేధింపులు ఎదుర్కొంటున్న వృద్దుడు.

Khammam: అయ్యో.. నాకు దిక్కెవరు..? కన్నబిడ్డల వేధింపులు ఎదుర్కొంటున్న వృద్దుడు.

Anil kumar poka

|

Updated on: Jul 02, 2023 | 9:34 AM

కన్నబిడ్డలు గాలికొదిలేసిన ఓ కన్న తండ్రి వ్యథ ఇది. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన 75 ఏళ్ల తుమ్మలపల్లి పుల్లయ్యకు ఇద్దరు పిల్లలు. భార్య చనిపోయి 7 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి కన్నబిడ్డలిద్దరూ ఆయన్ను పట్టించుకోవడం మానేశారు.

కన్నబిడ్డలు గాలికొదిలేసిన ఓ కన్న తండ్రి వ్యథ ఇది. ఖమ్మం జిల్లా మధిర మండలం రాయపట్నం గ్రామానికి చెందిన 75 ఏళ్ల తుమ్మలపల్లి పుల్లయ్యకు ఇద్దరు పిల్లలు. భార్య చనిపోయి 7 ఏళ్లు దాటింది. అప్పటి నుంచి కన్నబిడ్డలిద్దరూ ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. కనీసం ఏ రోజూ పట్టెడన్నం కూడా పెట్టింది లేదు. దీంతో ఆయన ఒంటరిగానే జీవితం వెళ్లదీస్తున్నారు. కన్నతల్లి చనిపోతే కర్మకాండకు కూడా ఇద్దరు బిడ్డలు రాలేదంటున్నారు పుల్లయ్య. అంతే కాదు.. ఎప్పటికప్పుడు పెద్ద కొడుకు రామారావు తనపై చెయ్యి చేసుకుంటాడని కన్నీటి పర్యంతమవుతున్నారు. అలా కొట్టడం వల్ల చెవి పని చేయడం మానేసిందని, ఇప్పుడు తన పరిస్థితి మరింత దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికిత్స కోసం ఉన్న ఆస్తిని అమ్ముకునేందుకు ప్రయత్నిస్తుంటే పెద్ద కొడుకు కుటుంబమంతా తనపై మూకుమ్మడిగా దాడి చేసిందంటూ ధర్నాకు దిగారు. కన్న బిడ్డలు పెడుతున్న బాధలు గురించి గ్రామ పెద్దలు, పోలీసులతో మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని కలెక్టర్ జోక్యం చేసుకొని తనకు న్యాయం చెయ్యాలంటూ కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన దీక్షకు దిగారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..