PM Modi: గిరిజన మహిళలతో ప్రధాని మోదీ ఆసక్తికర సంభాషణ.. వారితో కలిసి భోజనం..
PM Narendra Modi: మధ్యప్రదేశ్‌లో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పకారియా, షాదోల్‌లోని పలు సంఘాల నాయకులతో సహా గ్రామ ఫుట్‌బాల్ క్లబ్‌ల కెప్టెన్‌లతో ప్రత్యేకంగా సంభాషించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పర్యటించిన..
PM Narendra Modi: మధ్యప్రదేశ్‌లో శనివారం పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ.. పకారియా, షాదోల్‌లోని పలు సంఘాల నాయకులతో సహా గ్రామ ఫుట్‌బాల్ క్లబ్‌ల కెప్టెన్‌లతో ప్రత్యేకంగా సంభాషించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు పర్యటించిన ఆయన గ్రామంలోని గిరిజన సంఘం, స్వయం సహాయక సంఘాలు, పెసా కమిటీల లీడర్లతో ఆసక్తికరమైన రీతిలో ముచ్చటించారు. ముఖ్యంగా ఎస్‌హెచ్‌జీ మహిళలతో సంభాషించిన ఆయన వారు చేసిన పనులను తాను కూడా చేయలేనన్నారు. ఈ క్రమంలోనే పలువురు మహిళలు ప్రధాని మోదీ నుంచి ఆర్థిక సలహాలు తీసుకున్నారు. అనంతరం రాష్ట్రానికి పేరు తెచ్చిన ఫుట్‌బాల్ క్రీడాకారులను కలిసి మాట్లాడారు. ఆపై పకారియా గిరిజనులతో కలిసి ప్రత్యేక భోజనం చేశారు.
మధ్యప్రదేశ్‌లో తన పర్యటనలో భాగంగా 2047 నాటికి రక్తహీనతను నిర్మూలించే లక్ష్యంతో షాడోల్‌లో నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే లబ్దిదారులకు సికిల్ సెల్ జెనెటిక్ స్టేటస్ కార్డ్‌లను కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు గిరిజన సంఘాలు, పేదల పట్ల సున్నితంగా వ్యవహరించాయని, గిరిజన మహిళ రాష్ట్రపతి కావడంపై ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందించాయో కూడా చూశామన్నారు. ఇంకా షాడోల్ డివిజన్‌లో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని ప్రారంభించినప్పుడు దానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమ కుటుంబం పేరు పెట్టారని, కానీ శివరాజ్ ప్రభుత్వం ఈ సంప్రదాయానికి స్వస్తి పలికి, విప్లవకారుడు రాజా శంకర్ షా పేరును చింద్వాడ విశ్వవిద్యాలయానికి పెట్టిందని ప్రధాని చెప్పారు.
#WATCH | Madhya Pradesh: Prime Minister Narendra Modi interacted with leaders of tribal community, Self-Help Groups, leaders of PESA committees and captains of village football clubs during his visit to Pakaria village, in Shahdol district, yesterday. pic.twitter.com/0kbowK2Lvh
— ANI (@ANI) July 2, 2023
అలాగే తాము కూడా తాంతియా తోపే స్మారకార్థం పాటల్ పాని స్టేషన్ అని పేరు పెట్టామని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతాల్లో విద్య, పాఠశాలల ప్రాముఖ్యత గురించి కూడా వివరించారు. ‘గిరిజన ప్రాంతాల్లో స్కూల్, కళాశాలల ప్రాముఖ్యత నాకు బాగా తెలుసు. అందుకే మా ప్రభుత్వం గిరిజన పిల్లలకు 400లకు పైగా కొత్త ఏకలవ్య పాఠశాలల్లో రెసిడెన్షియల్ విద్యను పొందే అవకాశం కల్పించింది. కేవలం మధ్యప్రదేశ్‌లోనే ఇలాంటి పాఠశాలల్లో 24 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు’ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..