Vinesh Phogat: రాజకీయాల వైపు రెజ్లర్ వినేష్‌ ఫోగట్‌ అడుగులు

భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ శంభు సరిహద్దులో రైతుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినేష్ ఫోగట్ మాట్లాడుతూ.. " రైతులు ఇక్కడ కూర్చొని 200 రోజులైంది. వారిని ఇలా చూస్తుంటే బాధగా ఉంది" అని పేర్కొన్నారు.

Vinesh Phogat: రాజకీయాల వైపు రెజ్లర్ వినేష్‌ ఫోగట్‌ అడుగులు
Vinesh Phogat With Farmers

Updated on: Aug 31, 2024 | 3:32 PM

లేడీ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ రైతుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఢిల్లీ- హర్యానా సరిహద్దులోని శంభు బోర్డర్‌ దగ్గర రైతుల ఆందోళనకు ఆమె హాజరయ్యారు. శంభు బోర్డర్‌లో రైతుల ఆందోళన 200 రోజులకు చేరుకున్న సందర్భంగా వినేష్‌ రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. నిరసన చేపట్టి 200 రోజులైనప్పటికీ రైతులు డిమాండ్లు నెరవేరలేదన్నారు. రైతులకు అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలన్నారు వినేష్‌ ఫోగట్‌. ఢిల్లీలో తాము ఆందోళన చేస్తునప్పుడు రైతులు సంపూర్ణ మద్దతిచ్చారని చెప్పారు. న్యాయం కోసం అన్నదాతలు పోరాటం చేస్తున్నారని అన్నారు. రైతులే దేశాన్ని నడుపుతున్నారు.. వారు లేకుండా ఏదీ సాధ్యం కాదన్నారు వినేష్‌ ఫోగట్‌. ఈ సందర్భంగా..  ‘‘మీరు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారా..?’’ అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఈ అంశంపై మాట్లాడదల్చుకోలేదు అని వినేష్ రిప్లై ఇచ్చారు. కాగా కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఈ నిరసన ఆగస్ట్ 31  నాటికి 200వ రోజుకు చేరుకుంది.

ఒలిపింక్స్‌లో 100 గ్రాముల అధిక బరువు కారణంగా తృటిలో మెడల్‌ మిస్సయ్యారు వినేష్‌ ఫోగట్‌. దేశమంతా ఆమెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే రైతుల ఉద్యమంలో పాల్గొని ఆమె రాజకీయాల వైపు అడుగులు వేస్తునట్టు సంకేతాలు ఇచ్చారు.

మరిన్ని జాతీయవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..