దేశవ్యాప్తంగా వెహికల్ స్క్రాపింగ్ పాలసీ.. మీ వెహికిల్‌ కండీషన్‌ చెక్‌ చేసుకోండి..! లేదంటే..

|

Feb 09, 2023 | 4:08 PM

ఈ కొత్త విధానాన్ని ప్రోత్సహించడానికి, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రోడ్డు పన్నులో సడలింపుతో సహా అనేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది.

దేశవ్యాప్తంగా వెహికల్ స్క్రాపింగ్ పాలసీ.. మీ వెహికిల్‌ కండీషన్‌ చెక్‌ చేసుకోండి..! లేదంటే..
Vehicle Scrapping
Follow us on

దేశాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం స్క్రాప్ విధానాన్ని తీసుకొచ్చింది. పాత వాహనాల వల్ల కాలుష్యం ఏర్పడుతుంది కాబట్టి.. ప్రభుత్వం ఈ వాహనాలను రోడ్డుపై నుంచి ఎలాగైనా తొలగించాలని కోరుతోంది. మీకు 15 ఏళ్లు నిండిన వాహనం ఉంటే వెంటనే ఫిట్‌నెస్ టెస్ట్‌ చేయించుకోండి. లేకుంటే, ప్రభుత్వం దానిని స్క్రాప్ యార్డుకు పంపుతుంది. అయితే, గత ఏడాది కాలంలో స్క్రాప్ విధానంలో ఆరు రాష్ట్రాల్లో 5359 ప్రైవేట్, 67 వాణిజ్య వాహనాలు మాత్రమే రద్దు చేయబడ్డాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో మాత్రమే వాణిజ్య వాహనాల రద్దు జరిగింది.

ఏప్రిల్ 1వ తేదీ నుంచి గుజరాత్‌తో పాటు దేశవ్యాప్తంగా స్క్రాప్ విధానం అమలవుతున్నందున, 15 ఏళ్ల ట్రక్కులతో సహా భారీ వాణిజ్య వాహనాలు గుజరాత్‌లోని భన్గర్వాడ్‌కు వెళ్తాయని ప్రకటించారు.. ఈ వాహనాలన్నీ ఫిట్‌నెస్‌ సెంటర్‌లో ధ్రువీకరించుకుని సర్టిఫికెట్‌ పొందాలి. రాష్ట్రంలో 20 లక్షల పాత వాహనాలున్నాయి. ఇందులో టక్, టెంపో, ఐషర్, లగ్జరీ బస్సులతో సహా భారీ వాణిజ్య వాహనాలు ఉన్నాయి. ఈ కొత్త విధానాన్ని ప్రోత్సహించడానికి, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు రోడ్డు పన్నులో సడలింపుతో సహా అనేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందిస్తోంది. ఈ విధానం ప్రకారం, ఏప్రిల్ 1 నుండి 15 సంవత్సరాలు నిండిన అన్ని ప్రభుత్వ వాహనాలను తప్పనిసరిగా స్క్రాపింగ్ చేయాలని రహదారి, రవాణా మంత్రిత్వ శాఖ కోరింది. 2023 జనవరి 31 వరకు మొత్తం 5426 వాహనాలు రద్దు చేయబడ్డాయి.

ఈ వాహనాలను రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లలో అంటే RVSF వద్ద స్క్రాప్ చేయాలి. ప్రైవేట్ రంగం నిర్వహిస్తున్న ఈ కేంద్రాలలో జనవరి 1, 2022 నుండి జనవరి 31, 2023 వరకు మొత్తం 5426 వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి. ఇది ప్రైవేట్, వాణిజ్య రెండింటినీ కలిగి ఉంటుంది. రక్షణ సేవలు, శాంతిభద్రతలు, అంతర్గత భద్రతలో ఉపయోగించే వాహనాలకు 15 ఏళ్ల నాటి వాహనాలను తప్పనిసరిగా స్క్రాపింగ్ చేయడం మినహాయించబడింది.

ఇవి కూడా చదవండి

మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, గత ఏడాదిలో కేవలం ఆరు రాష్ట్రాలు మాత్రమే 15 ఏళ్ల నాటి, కాలుష్య కారక వాహనాలను రద్దు చేశాయి. ఇందులో 4059 ప్రైవేట్, 50 వాణిజ్య వాహనాలను భాన్‌గర్వాడ్‌కు పంపిన యూపీ అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ రెండో స్థానంలో ఉంది. 1053 ప్రైవేట్, 17 వాణిజ్య వాహనాలు రద్దు చేయబడ్డాయి.

యూపీ, గుజరాత్‌తో పాటు అస్సాం, హర్యానా, మధ్యప్రదేశ్, చండీగఢ్‌లలో వాహనాలను రద్దు చేశారు. అస్సాంలో ఏడు, హర్యానాలో 40, మధ్యప్రదేశ్‌లో 188, చండీగఢ్‌లో 12 ప్రైవేట్ వాహనాలు మాత్రమే రద్దు చేయబడ్డాయి. రాష్ట్రాల్లో పాత వాహనాల స్క్రాపింగ్ నెమ్మదిగా జరగడానికి ఒక కారణం RVSFల సంఖ్య పరిమితం. రాజ్యసభలో మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం ప్రకారం, ఈ ఆరు రాష్ట్రాల్లో ప్రస్తుతం 11 రిజిస్టర్డ్ స్క్రాపింగ్ ఫెసిలిటీ సెంటర్లు మాత్రమే పనిచేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..