AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వందేమాతరంపై రాజకీయ రగడ.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్.. సోనియా గాంధీ ఏమన్నారంటే..

వందేమాతరం ఆలాపనపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ మరింత ముదురుతోంది. కాంగ్రెస్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వందేమాతరం పూర్తి వెర్షన్‌పై సోనియా గాంధీ చేసినట్లు కనిపించిన సంకేతాలు వివాదానికి దారితీశాయి. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేయగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ పార్టీ సంప్రదాయంగా ఆలపిస్తున్న రెండు చరణాల వందేమాతరాన్నే కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వందేమాతరంపై రాజకీయ రగడ.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్.. సోనియా గాంధీ ఏమన్నారంటే..
Vande Mataram Row
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2026 | 7:55 AM

Share

జాతీయ గేయం వందేమాతరానికి ప్రత్యేక గుర్తింపే కాదు.. దీనికి అవమానం జరిగితే కఠిన శిక్షలు తప్పవంటూ ఈమధ్యే పార్లమెంట్ చట్టం చేసింది. బట్.. జెండా వందనంలో కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో ప్లే అవుతున్న వందేమాతరం గేయాన్ని ఆపాలని కోరినట్టుగా బయటకు వచ్చిన వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువైంది. ఈ గొడవ అక్కడితో ఆగలేదు. ఖర్గే పాల్గొన్న సభలోనూ పాత వర్షన్‌ గేయాన్నే పాడటం మరింత దుమారం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం ఆలాపన తప్పనిసరి.. అందులోనూ బంకించంద్ర ఛటర్జీ రాసిన పూర్తి వర్షన్‌ను మాత్రమే పాడాలి. ఈ గేయం వస్తున్నప్పుడు ఎలాంటి ఇంటరప్షన్‌ ఉండకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే 3 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించేలా చట్టం ఉంది. అయితే, ఈ పూర్తి పాటను కాంగ్రెస్‌ పార్టీ కొద్దిరోజులుగా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఆఫీస్‌లో జరిగిన ఇండిపెండెన్స్‌ డే వేడుకల్లో అసలు వివాదం మొదలైంది. వందేమాతరం పూర్తి గీతం ప్లే అవుతున్న సమయంలో.. వెంటనే ఆ గేయాన్ని ఆపేయాలంటూ సోనియా గాంధీ సంకేతాలు ఇచ్చినట్లు కనిపించింది. ఈ గేయం మన దగ్గర వద్దంటూ అక్కడి నేతలకు మౌఖిక ఆదేశాలు కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. సోనియాతో పాటు కొత్త వర్షన్‌ పాటపై రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా తీవ్ర అభ్యంతరం తెలిపారు. వందేమాతరం పాత వర్షనే వేయాలని, ఇది మన పార్టీ వర్షన్‌ కాదంటూ రాహుల్‌ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి అసలు దేశభక్తే లేదని.. జాతీయ గేయంపై గౌరవం కరువైందంటూ బీజేపీతోపాటు పలు హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

స్పందించిన సోనియా గాంధీ..

వందేమాతరం గీతం ఆలాపనపై కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ కూడా పలు వ్యాఖ్యలు చేశారు. తనను జైలుకు పంపేందుకు కుట్ర జరుగుతోందని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సోనియా వ్యాఖ్యానించడంతో జాతీయ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

బీజేపీ ఆరోపణలను ఖండించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే

అయితే బీజేపీ ఆరోపణలకు ఘటైన కౌంటరిచ్చారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే. గాంధీ, నెహ్రూ,వాజ్‌పేయి పాడిన వందేమాతరం గీతాన్నే తాను ఆలపించినట్టు స్పష్టం చేశారు. బీజేపీకి నచ్చినట్టు కాంగ్రెస్‌ పార్టీ చేయదన్నారు. 90 ఏళ్ల నుంచి ఆలపిస్తున్న వందేమాతరం గీతాన్నే తాము ఆలపిస్తామని అన్నారు ఖర్గే.

కాంగ్రెస్ తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించిందంటూ విరుచుకుపడ్డారు.

ఇలా ఒకవైపు చట్టబద్ధత.. మరోవైపు రాజకీయ రగడతో వందేమాతరం వివాదం దేశ రాజకీయాన్ని వేడెక్కిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us