దేశంలో వ్యాక్సినేషన్ రెండో రోజు తగ్గిందే …? వెల్లువెత్తిన సందేహాలు…….కాంగ్రెస్ సెటైర్

| Edited By: Anil kumar poka

Jun 23, 2021 | 1:40 PM

Covid Vaccination Drive: దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టిన రెండో రోజైన మంగళవారం నాడు 53 లక్షలమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిన్ పోర్టల్ లెక్క ప్రకారం..53,86,951 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.

దేశంలో  వ్యాక్సినేషన్ రెండో రోజు  తగ్గిందే ...?  వెల్లువెత్తిన సందేహాలు.......కాంగ్రెస్ సెటైర్
Covid Vaccine
Follow us on

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేపట్టిన రెండో రోజైన మంగళవారం నాడు 53 లక్షలమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిన్ పోర్టల్ లెక్క ప్రకారం..53,86,951 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. వీటిలో మొదటి డోసుగా 47,55,674, రెండో డోసుగా 6,31,277 ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 59 మందికి సైడ్ ఎఫెక్ట్స్ సోకినట్టు పేర్కొంది. మొదటి రోజున ..జూన్ 21 న 88 లక్షల మందికి పైగా టీకామందు తీసుకున్నారని, గ్రామాల్లో 63.7 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో 36 శాతం మంది తీసుకున్నట్టు ఈ శాఖ వివరించింది. కాగా-ఇది ప్రభుత్వం ముందే వేసుకున్న (ప్రీ-ప్లాన్డ్) ఇమేజ్ బూస్టర్ అని కాంగ్రెస్ విమర్శించింది. వ్యాక్సినేషన్ ఒకరోజు సంరంభంగా ముగిసిందని, ఆదివారం నాడు హోరెత్తిస్తే సోమవారం వ్యాక్సినేషన్ చేపడితే..మంగళవారానికి అది పడిపోయిందని సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. సింగిల్ డేలో వరల్డ్ రికార్డు లోని ‘సీక్రెట్’ ఇదేనన్నారు. ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి మెడిసిన్ లో నోబెల్ బహుమతి వచ్చినా ఆశ్చర్యం లేదని సెటైర్ వేశారు.

‘మోదీ హై ..ముమ్ కిన్ .హై’..’మోదీ హై మిరాకిల్ హై’ అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక ఇదే పార్టీకి చెందిన మరో నేత జైరాం రమేష్.. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒకరోజు ఒకలా..మరో రోజు మరొకలా ఉందని విమర్శించారు. రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా, పంపిణీ ఎలా కేటాయిస్తారన్న దానిపై స్పష్టత లేదని, పారదర్శకత అంతకన్నా లేదని అయన అన్నారు. కనీసం రానున్న నాలుగైదు నెలలకు రోజుకు 80 లక్షలమందికి పైగా టీకామందు ఇవ్వాలన్న లక్ష్యం ఉండాలని, అది సాధ్యమయ్యేలా చూడాలని జైరాంరమేష్ కోరారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్ ఆవేదన..:

విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.

Rakul Preet Singh : క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా..?ఫైర్ అవుతున్న రకుల్ ప్రీత్.

నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్న ధోనీ’ని ఇలా మీరెప్పుడూ చూసుండరు..వైరల్ అవుతున్న ఫోటోలు.:MS Dhoni video.