Vaccination: మే 1 నుంచి అందరికీ టీకా సరే.. వ్యాక్సిన్ సరఫరా కొరతను ఎలా అధిగమిస్తారు? నిపుణులు ఏమంటున్నారు?

కరోనా రెండో వేవ్ మన దేశాన్ని ముంచేస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. దీంతో చాలా నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొన్ని చోట్ల వారాంతపు లాక్ డౌన్ విధించారు.

Vaccination: మే 1 నుంచి అందరికీ టీకా సరే.. వ్యాక్సిన్ సరఫరా కొరతను ఎలా అధిగమిస్తారు? నిపుణులు ఏమంటున్నారు?
India Covid Vaccine
Follow us

|

Updated on: Apr 20, 2021 | 4:23 PM

VAccination: కరోనా రెండో వేవ్ మన దేశాన్ని ముంచేస్తోంది. ఇప్పటికే రోజువారీ కేసుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. దీంతో చాలా నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొన్ని చోట్ల వారాంతపు లాక్ డౌన్ విధించారు. ఢిల్లీలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఇదిలా ఉంటె కరోనా కేసులు పెరిగిపోతున్న నేపధ్యంలో కరోనాను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ ఒకటే బ్రహ్మాస్త్రం అని అందరూ నమ్ముతున్నారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. కరోనా టీకాలను మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న ఒక్కటే. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కొరత ఉందని చెబుతున్నారు. కేవలం 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రం ఇవ్వడానికి నిర్నయిస్తేనే కరోనా టీకా తగినంత అందుబాటులో లేని పరిస్థితి. మరి ఇప్పుడు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలంటే..దానికి సరిపడా టీకాలు దొరుకుతాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. అయితే, ఈ ఇబ్బందిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదానిపై నిపుణులు పలు రకాల సూచనలు చేస్తున్నారు. రష్యాకు చెందిన స్ఫుత్నిక్ v వ్యాక్సిన్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టీకా మన దగ్గర మే మొదటి వారంలో అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. ఇలా చేస్తే టీకా కొరతను అధిగమించే అవకాశం ఉంటుందని అంటున్నారు.

దిగుమతి సుంకం తగ్గించడం.. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ పై ఉన్న దిగుమతి సుంకాన్ని మాఫీ చేస్తే.. టీకా దిగుమతి పెరుగుతుంది. తద్వారా వ్యాక్సిన్ లభ్యత పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పుడు టీకాపై 10 శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనిని మాఫీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ప్రయివేట్ సంస్థలకు అనుమతి ఇవ్వడం.. ఇప్పటివరకూ వ్యాక్సిన్ పంపిణీ అంతా ప్రభుత్వమే చూస్తోంది. బహిరంగ మార్కెట్లో టీకాల లభ్యత లేదు. ప్రయివేట్ రంగంలో టీకాల అమ్మకాలు ప్రారంభించేలా చేస్తే వ్యాక్సిన్ లభ్యత మరింత పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అర్హత ఉన్న ప్రయివేట్ సంస్థలకు వ్యాక్సిన్ దిగుమతి చేసుకునేందుకు అవకాశం కలిపిస్తే మంచిదని వారు సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటె.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొనుగోలు చేయడానికి రూ .4500 కోట్లు చెల్లించింది. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు 3000 కోట్ల రూపాయలు, భారత్ బయోటెక్‌కు 1500 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఈ డబ్బు రెండు-మూడు నెలల టీకా సరఫరా కోసం అడ్వాన్స్‌గా ఇవ్వబడింది. వ్యాక్సిన్ తయారీ సంస్థలకు ప్రభుత్వం గ్రాంట్లు ఇచ్చిందని గతంలో వార్తలు వచ్చాయి. ఇదే విధంగా మరికొన్ని కంపెనీలకు కూడా ఇవ్వడం ద్వారా వ్యాక్సిన్ అధిక మోతాదులో దేశంలోకి వచ్చేట్టు చేసుకోవచ్చు.

వ్యాక్సిన్ తయారుచేసే సంస్థలు తమ సరఫరాలో 50% కేంద్రానికి సరఫరా చేసే విధంగా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మిగిలిన 50% ను రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేయవచ్చు లేదా బహిరంగ మార్కెట్లో అమ్మవచ్చు. కోవిన్ ద్వారా నమోదు తొ మాత్రమె వ్యాక్సిన్ అందిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రాలకు కూడా కంపెనీల నుండి నేరుగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి అధికారాలు ఇచ్చారు. అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాక్సినేషన్ విషయంలో చురుకుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు వ్యాక్సిన్ కొరత రాకుండా చూసుకోవడమే అనడంలో సందేహం లేదు.

Also Read: CM Wife Corona Positive: ముఖ్యమంత్రి భార్యకు కరోనా పాజిటివ్.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ముఖ్యమంత్రి..

Corona Virus:మానవత్వమా నీ చిరునామా ఎక్కడ..? కోవిడ్ పాజిటివ్ దంపతులను ఇంట్లో పెట్టి.. లాక్ వేసిన ఎదురింటి ప్లాట్ ఓనర్

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..