Uttarakhand: పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి కాలు పంచాయతీ.. ఏకంగా SSP ఆఫీసులో ఫిర్యాదు చేసిన మహిళ

|

Sep 03, 2024 | 5:21 PM

కోడి కాలు విరిగితే ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ దగ్గరకు వెళ్తారా.. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి షాకింగ్ కేసు ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. SSP కార్యాలయానికి ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. తన కోడి కాలు విరిగిందని మహిళ ఫిర్యాదు చేసింది. అంతే కాదు కోడి కాళ్లు విరగ్గొట్టిన వారిపై నిరసన కూడా తెలుపుతుంటే వారు తనను కొట్టినట్లు కూడా వెల్లడించింది.

Uttarakhand: పోలీస్ స్టేషన్ కు చేరిన కోడి కాలు పంచాయతీ.. ఏకంగా SSP ఆఫీసులో ఫిర్యాదు చేసిన మహిళ
Udham Singh
Follow us on

సాధారణంగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాలంటే ఎవరూ ఇష్టపడరు. అయితే తప్పని సరి పరిస్థితుల్లో అంటే ఏదైనా గొడవ జరిగినా, ఎవరికైనా చేయి, కాలు విరిగినా, మరేదైనా బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తారు. అయితే ఎప్పుడైనా కోడి కాలు విరిగితే ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ దగ్గరకు వెళ్తారా.. ఈ విషయం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి షాకింగ్ కేసు ఉత్తరాఖండ్‌లోని ఉధమ్ సింగ్ నగర్ లో జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. SSP కార్యాలయానికి ఒక మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చింది. తన కోడి కాలు విరిగిందని మహిళ ఫిర్యాదు చేసింది. అంతే కాదు కోడి కాళ్లు విరగ్గొట్టిన వారిపై నిరసన కూడా తెలుపుతుంటే వారు తనను కొట్టినట్లు కూడా వెల్లడించింది.

అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్న మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ చేపట్టలేదని పేర్కొంది. దీంతో తాను ఎస్‌ఎస్పీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడానికి వచ్చినట్లు తెలిపింది. బాధిత మహిళ లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం పంపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. చివరకు కోడి కాలు విరిగిన కేసు ఎస్‌ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది.. కనుక తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది కోడి యజమాని.

కర్రలతో కొట్టారు

ఇవి కూడా చదవండి

బజ్‌పూర్‌లోని మజ్రా ఖుషల్‌పూర్ నివాసి లక్ష్మి. ఇరుగుపొరుగున ఉన్న కొందరు లక్ష్మి కోడి కాలు విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. లక్ష్మి తన కోడిని కాపాడే ప్రయత్నం చేసింది. అప్పుడు ఇరుగు పొరుగు వారు లక్ష్మితో వాగ్వాదానికి దిగారు. రాంవతి, నిషా, దీక్షా అనే మహిళలు పోరుబాట పట్టారు. మహిళలు లక్ష్మిపై వేధింపులకు దిగారు. ఆ మహిళలు వేధింపులతో ఆగలేదు..కర్రలను చేతబట్టారు. లక్ష్మిని కింద పడేసి కొట్టారు. లక్ష్మి తన ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎటువంటి చర్యలు తీసుకోలేదంటు ఆ మహిళ జరిగిన మొత్తం ఘటనపై ఎస్‌ఎస్పీ మంజునాథ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..