Uttarakhand Glacier Outburst: ‘ఉత్తర’ ప్రళయం, మూడు వేల కోట్లు నీళ్ల పాలు ! వరదల్లో తుడిచిపెట్టుకుపోయిన తపోవన్ డ్యామ్
ఉత్తరాఖండ్ లో పోటెత్తిన వరదలు, గ్లేసియర్ ఔట్ బరస్ట్ కారణంగా తపోవన్ లోని విష్ణుగాడ్ హైడ్రో పవర్ ప్లాంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది...
Uttarakhand Glacier Outburst: ఉత్తరాఖండ్ లో పోటెత్తిన వరదలు, గ్లేసియర్ ఔట్ బరస్ట్ కారణంగా తపోవన్ లోని విష్ణుగాడ్ హైడ్రో పవర్ ప్లాంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ధౌలీ గంగా, రిషిగంగా నదుల పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రాజెక్టు పూర్తిగా దెబ్బ తిన్నది. దాదాపు 3 వేల కోట్ల రూపాయల వ్యయంతో నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.(దీనివల్ల 520 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.)రాజధాని డెహ్రాడూన్ కి 280 కి.మీ. దూరంలో ఉన్న ఈ ప్రాజెక్టు తాలూకు ఫోటోలను భారత వైమానిక దళానికి చెందిన ‘రీకనాయిజన్స్’ విమానాలు గగనతలం నుంచి తీశాయి. తపోవన్ సమీపంలోని మలారీ వ్యాలీ ఎంట్రెన్స్ వద్ద ఉన్న రెండు బ్రిడ్జీలు కూడా ఈ ప్రకృతి వైపరీత్యంలో పూర్తిగా కొట్టుకుపోయాయి. సహాయ చర్యలు యుధ్ధ ప్రాతిపదికన ఇంకా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.
కానీ జోషీ మఠ్, తపోవన్ మధ్య రోడ్డు మాత్రం చెక్కుచెదరలేదు. ఈ ప్లాంట్ లో పని చేస్తున్నవారిలో సుమారు 170 మంది జాడ కనిపించడంలేదని ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం తరచూ మెరుపు వరదలకు గురవుతూ ఉంటుంది. కొండ చరియలు విరిగి పడుతుంటాయి. పర్యావరణ పరంగా ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించరాదని పర్యావరణవేత్తలు సూచిస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా వాటికి అనుమతులిస్తోంది.
Also Read: