Uttarkhand: ఉత్తరాఖండ్‌లో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. 39మందికి గాయాలు.. వర్షాలతో రెస్క్యూ ఆపరేషన్ ఆలస్యం
ప్రమాదం జరిగినప్పుడు భారీ వర్షం కురిసిందని.. అందుకనే రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని.. అధికారులు చెప్పారు. బస్సు అతివేగామే ఈ ప్రమాదానికి కారణం అని.. బస్సు వేగంతో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.
Uttarkhand: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై ITBP సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు లోతైన లోయలో పడిపోయింది. బస్సు లోయలో పడి.. సమీపంలోని నదిలోకి జారుకుంది.. దీంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. బస్సులో దాదాపు 39 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎనిమిది మంది ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు, మరో 31 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స ను అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ముస్సోరి పోలీసు, అగ్నిమాపక దళం బృందం స్పందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బస్సు నుంచి ప్రయాణీకులను వెలికి తీసి.. 108 అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే డెహ్రాడూన్ డీఎం సోనియా సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని డీఎం సోనియా సింగ్ వైద్యులను ఆదేశించారు. ముస్సోరి పోలీసు, అగ్నిమాపక దళం బృందం సంఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది.
उत्तराखंड: मसूरी देहरादून रोड पर राज्य परिवहन की बस के गहरी खाई में गिरने से कई लोग घायल हुए। pic.twitter.com/0elZog4szu
— ANI_HindiNews (@AHindinews) August 7, 2022
ప్రమాదం జరిగినప్పుడు భారీ వర్షం కురిసిందని.. అందుకనే రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని.. అధికారులు చెప్పారు. బస్సు అతివేగామే ఈ ప్రమాదానికి కారణం అని.. బస్సు వేగంతో అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదాన్ని చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటన జరిగిన ప్రాంతం ఐటీబీపీ క్యాంపు సమీపంలోనే ఉండడంతో ఐటీబీపీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. ఐటీబీపీ, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..