PM Modi- Chandrababu: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై ప్రధాని మోడీ, చంద్రబాబు.. ఆప్యాయంగా పలకరింపులు, ముచ్చట్లు

Politics:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎంగా ఉండగా.. ఎక్కువగా కనిపించిన ఇదే సీన్‌ 2017 తర్వాత మాత్రం ఎక్కడా ఆవిష్కృతం కాలేదు. 2019 ఎన్నికలకు ముందు.. ఇంకా పక్కాగా చెప్పాలంటే 2017లో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి, టీడీపీకి వ్యవహారం చెడిన తర్వాత..

PM Modi- Chandrababu: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఒకే వేదికపై ప్రధాని మోడీ, చంద్రబాబు.. ఆప్యాయంగా పలకరింపులు, ముచ్చట్లు
Pm Modi Chandrababu
Follow us
Basha Shek

|

Updated on: Aug 07, 2022 | 7:36 PM

Politics:టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎంగా ఉండగా.. ఎక్కువగా కనిపించిన ఇదే సీన్‌ 2017 తర్వాత మాత్రం ఎక్కడా ఆవిష్కృతం కాలేదు. 2019 ఎన్నికలకు ముందు.. ఇంకా పక్కాగా చెప్పాలంటే 2017లో ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి, టీడీపీకి వ్యవహారం చెడిన తర్వాత మోడీ, చంద్రబాబు ఎదురుపడింది లేదు. మాట్లాడుకుందీ లేదు. ఇలాంటి దృశ్యం కనిపించనే లేదు. అక్షరాలా ఐదేళ్ల తర్వాత మోడీ, చంద్రబాబు ఒకేచోట కనిపించారు. ఒకేచోట కనిపించడం మాత్రమే కాదు.. మిగతా వాళ్లందరూ ఓ వైపు ఉంటే, మోడీ చంద్రబాబు మరోవైపునకు వెళ్లి ముచ్చటించడం కూడా అందరి చూపునూ వాళ్లవైపు తిప్పుకునేలా చేసింది. రాష్ట్రపతి భవన్‌లో ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమానికి సంబంధించి మీటింగ్ జరిగింది. ఈ సభకు చంద్రబాబుకు కేంద్రం ఆహ్వానం పంపింది. అమృతోత్సవ్‌ కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రబాబు దాదాపు అరగంట పాటు నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. అక్కడే పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలతోనూ మాట్లాడారు. ఇందతా పెద్దగా వార్తల్లో అంశం కాకపోయినా.. ఆ కాసేపటికి మోదీ, చంద్రబాబు నవ్వుకుంటూ ఓ పక్కకు వెళ్లి పరస్పరం మాట్లాడుకోవడం మాత్రం హైలైట్ ఆఫ్ ది డేగా మారింది.

పాలిటిక్స్‌లో కొత్త చర్చకు..

ఇంతకీ ఐదేళ్ల తర్వాత 5 నిమిషాల పాటు ప్రత్యేకంగా ముఖాముఖి భేటీ అయిన మోడీ, చంద్రబాబు ఏం మాట్లాడుకున్నారు. వ్యక్తిగత అంశాలు చర్చకొచ్చేంత తీరక ఉన్న స్థాయి ఇద్దరు నేతలదీ కాదు. కచ్చితంగా రాజకీయ అంశాలే అయ్యి ఉండాలి. మళ్లీ చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా? ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి చెప్పారా? 2014 తరహాలోనే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందన్న సలహా ఇచ్చారా? ఏపీలో అరాచక పాలన అని, సీఎంగా జగన్‌ తీరు బాలేదని, అప్పులు పెరిగాయని పదేపదే విమర్శిస్తోంది టీడీపీ. జగన్‌పై అలాంటి ఫిర్యాదులనే చంద్రబాబు ప్రధాని ముందు ఉంచారా? లేదంటే ప్రధాని మోడీనే చంద్రబాబును ఏమైనా ఏపీలో పాలనా పరిస్థితులపై ఆరా తీశారా? రాజకీయ స్థితిగతులపై లెక్కలు అడిగి తెలుసుకున్నారా? ఇవన్నీ ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నలు. అధికారికంగా అటు నుంచో, ఇటు నుంచో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప ఇప్పటికిప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్కపోవచ్చు. కానీ చాలా ఏళ్ల తర్వాత కనిపిస్తున్న ఈ సీన్ మాత్రం ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చకు దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..