AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Glacier Burst Updates: ఉత్తరాఖండ్ జలప్రళయం.. 14 మంది మృతదేహాలు స్వాధీనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు

Uttarakhand Glacier Burst Updates: హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడటంతో ఉత్తరాఖండ్‌లో ఇప్పటివరకు 14 మంది మరణించారని ఛమోలీ పోలీసులు వెల్లడించారు. వారి మృతదేహాలను స్వాధీనం..

Glacier Burst Updates: ఉత్తరాఖండ్ జలప్రళయం.. 14 మంది మృతదేహాలు స్వాధీనం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
Shaik Madar Saheb
|

Updated on: Feb 08, 2021 | 9:59 AM

Share

Uttarakhand Glacier Burst Updates: హిమాలయాల్లో మంచుచరియలు విరిగిపడటంతో దేవభూమి ఉత్తరాఖండ్‌ను జలప్రళయం అతలాకుతలం చేసింది. దీంతో చమోలీ జిల్లాలోని జోషిమఠ్‌ సమీపంలోని ధౌలి గంగానది ఉప్పెనలా పోటెత్తింది. ఆదివారం అలకనంద, ధౌలి గంగా నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నవారంతా వరదలో చిక్కుకుపోయారు. తపోవన్‌–రేణిలో ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్‌ ప్రాజెక్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదం అనంతరం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సాయుధ దళాలు నిరంతరం రెస్క్యూ నిర్వహిస్తున్నాయి. 14 మంది మ‌ృతదేహాలు స్వాధీనం.. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 14 మంది మరణించారని ఛమోలీ పోలీసులు వెల్లడించారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. ఇప్పటివరకు మొత్తం 15 మందిని రక్షించినట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 170 మంది వరకు తప్పిపోయారు. టెన్నెళ్ల ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. ఇదిలాఉంటే.. సోమవారం ఉదయం కూడా ధౌలీ గంగానదిలో వరద ప్రవాహం ఒక్కసారిగా పోటెత్తింది. నిన్న సంభవించిన వరదల తరువాత రాత్రి 8గంటల సమయంలో ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.

Also Read:

గంగమ్మ ప్రకోపానికి ఉత్తరాఖండ్ విలవిల.. జలప్రళయంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారంః సీఎం రావత్

Uttarakhand Glacier Burst Updates: తపోవన్ టన్నెల్‌లో చిక్కుకున్న 16 మంది సురక్షితం.. ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ..

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ బోణీ..నెదర్లాండ్స్‌పై ఘనవిజయం
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
గర్భిణీ స్త్రీలను పాములు కాటేయ్యవా.. ఆ శక్తి అడ్డుపడుతుందా..?
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..