Uttarakhand: వింత కేసు.. కొడుకు కోడలు ఏడాదిలోపు మనుమడిని ఇవ్వండి.. లేదా రూ. 5 కోట్లు చెల్లించండి

|

May 12, 2022 | 9:49 PM

హరిద్వార్‌లోని ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక జంట తమ కొడుకు కోడలు ఏడాదిలోపు మనవడిని ఇవ్వాలని లేదా "పరిహారం"గా రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. మేరుకు కోర్టు మెట్లు ఎక్కారు.

Uttarakhand: వింత కేసు.. కొడుకు కోడలు ఏడాదిలోపు మనుమడిని ఇవ్వండి.. లేదా రూ. 5 కోట్లు చెల్లించండి
Haridwar Couple
Follow us on

Uttarakhand: అసలు కంటే వడ్డీ ముద్దు అన్న సామెతలా.. తమ పిల్లల కంటే.. తమ పిల్లలకు పుట్టే సంతానంతో గడపాలని, తమ మనవాళ్లతో ఆడుకోవాలని వారి ముద్దుముచ్చట తీర్చాలని ఎక్కువమంది కోరుకుంటారు. అయితే తమ పిల్లలకు పిల్లలు పుట్టడం లెట్ అయితే.. వారితో పూజలు చేయిస్తారు. వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లారు.. ఈ విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా తమ కొడుకు, కోడలు తమకు మనవడిని కని ఇవ్వలేదంటూ.. ఓ అత్తగారు ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఏడాది లోపులో మనవడిని ఇవ్వాలని.. లేదా పరిహారంగా తమకు రూ. 5  కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కోర్టు మెట్లు ఎక్కింది ఓ తల్లి. ఉత్తరఖండ్‌‌ లో జరిగిన ఈ వింత కేసు ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హరిద్వార్‌లోని ఒక విచిత్రమైన కేసులో ఒక జంట తమ కొడుకు, కోడలు నుండి ఏడాదిలోపు మనవడిని కని ఇవ్వాలని.. లేదా తమకు “పరిహారం”గా రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ దంపతులు కొడుకును కోర్టుకు లాగారు

ఇవి కూడా చదవండి

‘ఏడాదిలోపు మనుమడిని ఇవ్వండి లేదా రూ. 5 కోట్లు చెల్లించండి అని హరిద్వార్ కు చెందిన దంపతులు కొడుకు ప్రసాద్ కోడలుపై దావా వేశారు.  తన కొడుకు చదువు కోసం తమ డబ్బు అంతా ఖర్చు పెట్టారు. ఇక మనవళ్లను పొందాలనే ఆశతో 2016 లో అతనికి మంచి సంబంధం చూసి వివాహం చేశారు. అంతేకాదు నవ దంపతులకు డబ్బులు ఖర్చు చేసి హనీమూన్ కోసం థాయ్‌లాండ్ పంపారు. ఆ తర్వాత అందరు తల్లిదండ్రుల లాగానే ఆ దంతపతులు కూడా మనవడో మనవరాలో పుడుతుందని వేయి కళ్లతో ఎదురు చూశారు. తమ కొడుక్కు పెళ్లి చేసి ఆరేళ్ళు అయినా పిల్లలు పుట్టలేదు. దీంతో ఆ దంపతులు విసిగిపోయారు. ఈ క్రమంలోనే కొడుకు, కోడలికి వ్యతిరేకంగా ఆ తల్లి హరిద్వార్ జిల్లా కోర్టును ఆశ్రయించింది.

ఈ సందర్భంగా ప్రసాద్ తల్లి మాట్లాడుతూ.. “నా కొడుకుకు నా డబ్బు అంతా ఇచ్చాను, అతనికి అమెరికాలో శిక్షణ ఇప్పించాను. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు. ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులో అప్పు తీసుకున్నాం. ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఇబ్బంది పడుతున్నాం. అందుకనే తాము ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్లు పరిహారం డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

మాకు లింగ బేధం లేదు.. అయినా మాకు మనవడే కావాలి:

“మేము మా పిల్లల కోసం పెట్టుబడి పెట్టాము, మంచి సంస్థల్లో పని చేసేలా వారికి శిక్షణ ఇప్పించామని ప్రసాద్ తండ్రి చెప్పారు. పిల్లలు తమ తల్లిదండ్రులకు ప్రాథమిక ఆర్థిక సంరక్షణను ఇవ్వాలని అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..