Watch Video: యూపీలో ఎస్పీ లీడర్ కారును ఢీకొన్న లారీ.. ఏకంగా 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం.. కుట్రేనా?

|

Aug 08, 2022 | 12:21 PM

Uttar Pradesh: సమాజ్‌వాది పార్టీకి చెందిన ముఖ్య నేత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఢీకొట్టిన లారీ.. దాదాపు 500 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది.

Watch Video: యూపీలో ఎస్పీ లీడర్ కారును ఢీకొన్న లారీ.. ఏకంగా 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన వైనం.. కుట్రేనా?
Up
Follow us on

Uttar Pradesh: సమాజ్‌వాది పార్టీకి చెందిన ముఖ్య నేత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆయన కారును ఢీకొట్టిన లారీ.. దాదాపు 500 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కానప్పటికీ.. స్థానికంగా కలకలం సృష్టించింది. యూపీలోని మెయిన్‌పురిలో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం అర్థరాత్రి సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ యాదవ్ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. అలా ఢీకొన్న లారీ.. కారును ఏకాఎకిన 500 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ప్రమాదం జరిగిన ప్రాంతమంతా రద్దీగా ఉంది. అయినప్పటికీ ట్రక్కు.. అంత దూరం ఈడ్చుకెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, ట్రక్కు కారును ఢీకొనగానే స్థానికులు పరుగెత్తుకెళ్లారు. కారును ఈడ్చుకెళ్తుండగా.. ట్రక్కును వెంబడించారు. బైక్‌లపై కొందరు, పరుగులు తీస్తూ మరికొందరు వెళ్లారు. కొంత దూరం వెళ్లాక ట్రక్కు ఆగిపోవడంతో.. డ్రైవర్‌ను పట్టుకుని చితకబాదారు.

కాగా, ప్రమాద సమయంలో ఎస్పీ నేత ఒక్కరే కారులో ఉన్నారు. కారులో చిక్కుకున్న ఆయన్ను క్షేమంగా బయటకు తీశారు స్థానికులు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయం అవలేదు. దాంతో స్థానికులు, సమాజ్ వాదీ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

కారును 500 మీటర్ల మేర ఈడ్చుకెళ్లిన విధానం చూసి ఇది నిజంగా ప్రమాదమేనా? ఏమైనా కుట్ర ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, స్వల్పగాయాలైన దేవేంద్ర సింగ్ యాదవ్‌ స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స తీసుకుని, అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..